పట్నా : దుర్గాదేవి నిమజ్జనం సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా ఓ వ్యక్తి మరణించారు. ఈ ఘటన బీహార్‌లోని మంగేరిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో పోలీసులకు, కొంతమంది ప్రజలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సమూహంలోని కొంతమంది దుండగులు కాల్పులు జరపగా 18 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. తర్వాత పోలీసులపై కొంతమంది రాళ్లురువ్వగా, పోలీసులు సైతం గాల్లో కాల్పులు జరిపినట్లు సమాచారం. (‘పది లక్షల ఉద్యోగాల కల్పనపైనే తొలి సంతకం’ )
ఈ ఘటనలో దాదాపు 20 మంది పోలీసులు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఎస్పీ లిపి సింగ్ అన్నారు. సంఘటనా ప్రాంతం నుంచి మూడు పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలకు దిగాయి. వెంటనే ఎస్పీ సింగ్‌ను సస్పెండ్ చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మృతుడి కుటుంబానికి 50 లక్షల నష్ట పరిహారంతో పాటు వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. (బిహార్ ఎన్నికలపై ‘మద్యం’ ప్రభావం! )
Comments
Please login to add a commentAdd a comment