కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథంగా జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
హైదరాబాద్: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథంగా జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. బ్యాలెట్ పత్రంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి పేరు శోభానాగిరెడ్డి పేరు, ఆ పార్టీ గుర్తు ఉంటాయి. అయితే ఆమెకు వేసే ఓటుని 'నోటా'గా పరిగణిస్తారు.
కర్నూలులో వైఎస్ఆర్ సిపి తరపున ప్రస్తుతానికి మరో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేదు. ఇప్పటికే బ్యాలెట్ పేపరు, అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. శోభానాగిరెడ్డికి ఓటు వేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. ఆళ్లగడ్డలో ఫ్యాన్ గుర్తుకి వేసే ఓటును ‘నోటా’గానే పరిగణిస్తామని ఇసి స్పష్టం చేసింది. ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి మినహా మిగిలిన వారిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు.