ముంబై : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంచాయితీ కొలిక్కి వచ్చింది. కూటమిలోని ఒక్కో పార్టీ 85 సీట్లలో పోటీ చేస్తున్నట్లు కుటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.
మహరాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 20న జరగనున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్ ఠాక్రే వర్గం),నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌పవార్ వర్గం)లోని మహా వికాస్ అఘాడీ కూటమి పోటీ చేస్తున్నాయి.
నిన్న మొన్నటి వరకు ఎంవీఏలోని ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత లేదు. సీట్ల పంపకాల విషయంలో కూటమి పార్టీల నేతల మధ్య ఫలు దఫాలుగా జరిగిన చర్చాలు జరిగాయి. తాజాగా బుధవారం జరిగిన చర్చల అనంతరం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి 255 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు కూటమి నేతలు వెల్లడించారు. మిగిలిన 33 స్థానాలపై తర్వలో స్పష్టత ఇవ్వనున్నారు.
బీజేపీ తొలి జాబితా విడుదల
మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 99 మందితో బీజేపీ మొదటి జాబితా విడుదల చేసింది. వీరిలో 71 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. ఇందులో ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ కుమార్తె శ్రీజయ చవాన్‌కు చోటు దక్కింది. ఇంకా డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులె, అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్, మంత్రులు గిరీశ్ మహాజన్, సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ వంటి ప్రముఖులు ఉన్నారు.
జాబితాలో మొత్తం 13 మహిళల పేర్లున్నాయి. చించ్వాడ్, కల్యాణ్ ఈస్ట్, శ్రీగొండ స్థానాల్లో మాత్రం సిట్టింగ్‌లకు బదులు కొత్త వారికి అవకాశమిచ్చింది. ముంబైలోని పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్లో 14 మందిని మళ్లీ నామినేట్ చేసింది. సుమారు 150 సీట్లలో పోటీ చేసేందుకు మిత్రపక్షాలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment