
నలిగిపోతున్న ‘నాలుగో సింహం’!
వరుస ఎన్నికలు, రాజకీయ పార్టీల సమావేశాలకు బందోబస్తు, శాంతిభద్రతల పర్యవేక్షణ, మానసిక ఒత్తిళ్లతో ‘నాలుగో సింహం’ నలిగిపోతోంది. ఎన్నికల విధులతో పోలీసులకు విశ్రాంతి లేకుండా పోయింది. వారాంతపు సెలవుల ఊసే లేదు. వాటిని ఎప్పుడో మరిచిపోయారు. అత్యవసర పరిస్థితులలో 24 గం టలూ విధులలోనే ఉంటూ కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తోంది.
పాతకాలపు లెక్కలతో నియమించిన పోలీసుల సంఖ్య పెరగకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే పని భారం పెరుగుతోంది. శారీరకంగా అలిసిపోతున్న పోలీసులకు అనారోగ్యం సమస్యలు వెంటాడుతున్నాయంటున్నారు.
ఇటు రోగాలు, అటు ఒత్తిళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలకు బందోబస్తు వారికి కత్తిమీద సాముగా మారుతోంది. జిల్లా కేంద్రంలో ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభ నిర్వహించింది.
తర్వాత ఏ ఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ జిల్లాలో పర్యటిం చారు. కేసీఆర్ మరోమారు గురువారం జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇలా ప్రముఖుల సభలకు బందోబస్తు నిర్వహించడం పోలీసులకు తీరికలేకుండా పోయింది.
ఇదీ లెక్క
2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 25 లక్షలు. జిల్లాలో 36 మండలాలు, నాలుగు రెవెన్యూ డివిజన్లు, 718 రెవెన్యూ గ్రామాలున్నాయి. పోలీసుశాఖ విభజన ప్రకారం నాలుగు సబ్‌డివిజన్లు, 17 పోలీసు సర్కిళ్లు, 45 పోలీసుస్టేషన్లుండగా అన్ని విభాగాలకు సంబంధించి 2,209 మంది ఆ శాఖలో పనిచేస్తున్నారు. సిబ్బంది కొరత కారణంగా కేసుల పరిశోధన మందకొడిగా సాగుతోంది.
ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో అత్యధిక మంది వీవీఐపీల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి విధులకు పరిమితమవుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తున్నది మాత్రం అరకొర సిబ్బందే. పని ఒత్తిడి పెరిగినప్పటికీ సకాలంలో పదోన్నతులు రాక పోలీసు సిబ్బం ది నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు.
వృత్తిపరమైన ఒత్తిడుల కారణంగా కూడా పోలీసు సిబ్బంది ప్రజలతో సత్సంబంధాలను నెరపలేక పోతున్నారనే వాదన కూడా ఉంది. పని ఒత్తిడి కారణంగా కొందరు పోలీసుల ప్రాణాల మీదకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రాణాలు పోతున్నా..
మున్సిపల్ ఎన్నికలకు ముందు ఎల్లారెడ్డి చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై రాంచందర్ నరాలు చిట్లి మృతి చెందారు. మెడికల్ షాపు నుంచి బీపీ గోళీలు తెప్పించుకునే లోపే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబా ద్ తరలించగా ఆస్పత్రిలో మృతి చెందారు.
మున్సిపల్ ఎన్నికల సమయం లో పెట్రోలింగ్ డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ గఫూర్ గుండెనొప్పితో పడిపోయారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల బరి లో ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వం గన్‌మన్లను కేటాయించింది.
ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారం చేస్తున్న అభ్యర్థుల వెంట ఉండే వారికి సరైన విశ్రాం తి, సకాలంలో భోజనం లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా వారంలో ఒకరోజు పోలీ స్ సిబ్బందికి సెలవు ఇవ్వాలనే నిబంధన బ్రిటీష్ కాలం నుంచే అమల్లో ఉంది. స్వాతంత్య్రానంతరం కానిస్టేబుల్‌కు నెలకు రూ.30 జీతం సమయంలో కూడా వారంలో ఒకరోజు సెలవు ఇచ్చేవారట.
ప్రత్యే క పరిస్థితులలో సెలవు రోజు పనిచేస్తే ఒక రోజు జీతం అదనంగా చెల్లించేవారని, ఇప్పుడు వారంతపు సెలవూ లేదు. అదనపు వేతనమూ లేదని పోలీసువర్గాలు ఆవేదన చెందుతున్నాయి.
పోలీసులను వేధిస్తున్న వ్యాధులు
పోలీసుశాఖలో లక్షా పది వేల మంది పనిచేస్తుండగా 75 శాతం మంది క్షేత్రస్థాయిలో పనిచేసే కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లే ఉన్నారు. ప్రతి ఎనిమిదేళ్లకోసారి కనీసం ఒక పదోన్నతి పొందాల్సిన కానిస్టేబుళ్లు సర్వీసు కాలం మొత్తం అదే స్థాయిలో పనిచేసి ఉద్యో గ విరమణ పొందే దయనీయ పరిస్థితి కూడా ఉంది.
ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి దశలవారీగా ‘మాస్టర్ హెల్త్ చెకప్’ చేయిస్తున్నారు.ఈ వైద్య పరీక్షలలో అనేక చేదు నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. సరియైన సమయంలో భోజనం, నిద్ర లేకపోవటంతో షుగర్‌వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉంది.
ఆ తర్వాత గుండెజబ్బు, మూత్రపిండాలు, కీళ్ల సం బంధిత వ్యాధుల వారు ఉన్నారు. పోలీసుశాఖలో ఆరోగ్య భద్రత ద్వారా చికిత్స పొందిన సిబ్బందిలో అత్యధికమంది 45 ఏళ్ల లోపువారు ఉండటం ఆందోళన కలిగించే అంశం. పోలీసుల్లో ఉదరకోశ, నోటి, రక్త సంబంధిత కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
పోలీసు సిబ్బంది జీవిత భాగస్వాముల్లో గర్భకోశ, చాతీ కేన్సర్ కేసులు ఇటీవల కాలంలో బాగా పెరుగుతున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందిలో అత్యధికమంది శ్వాస సం బంధిత వ్యాధులకు గురవుతున్నారు. అయితే ఉన్న తాధికారులు పోలీసు సిబ్బంది వ్యాధుల పట్ల శ్రద్ధవహించడం వారిలో ఊరట నింపుతోంది.