
చిన్నారిని ఆడిస్తున్న సీఐ మాధవి
హుజూరాబాద్‌రూరల్: మాతృత్వానికి ఏ విధులు అడ్డంరావు.. ఓవైపు ఎన్నికల్లో శాంతిభద్రతలను కాపాడుతూనే ఓ తల్లి ఓటేసేందుకు వెళ్లగా తన బిడ్డను పోలీస్ అనే విషయాన్ని మరిచిపోయి ఎత్తుకొని లాలించిన వైనం పలువురిని ఆలోచింపజేసింది. వివరాల్లోకి వెళ్తే మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో గురువారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భద్రత ఏర్పాట్లో విధులు నిర్వర్తిస్తున్న హుజూరాబాద్ టౌన్ సీఐ మాధవి ఓ చిన్నారి ని తన ఒడిలో చేర్చుకొని మమకారాన్ని చాటుకున్న సంఘటన చోటు చేసుకుంది. ఓటేసేందుకు వచ్చిన ఓ తల్లి పడుతున్న బాధను గమనించి ఆమె ఆర్నేళ్ల చిన్నారిని అక్కున చేర్చుకుని తన తల్లి ఓటేసి వచ్చే వరకు ఆలనా, పాలన చూసి ఆనందం పొందింది. దీంతో అక్కడికి ఓటేసి వచ్చిన ఓటర్లు, నాయకులు సీఐకి అభినందనలు తెలిపారు.