
10 నియోజకవర్గాలలో ముగిసిన పోలింగ్
హైదరాబాద్: ఈ సాయంత్రం 5 గంటలకు పది శాసనసభ నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటలకు మూడు నియోజకవర్గాలలో, 5 గంటలకు ఏడు నియోజకవర్గాలలో పోలింగ్ను ముగించారు. అయితే అప్పటి వరకు లైన్లో ఉన్నవారిని ఓటు వేసేందుకు అనుమతిస్తారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు, భద్రాచలంలలో 4 గంటలకు పోలింగ్ ముగిసింది. భద్రాచలంలో 72 శాతం పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఖానాపూర్, ఆసిఫాబాద్, చెన్నూరు, మంథని, అచ్చంపేట్, కొల్లాపూర్, సిర్పూర్‌లలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. క్యూలో ఉన్నవారికి మాత్రం ఓటు వేసే అవకాశం కల్పిస్తారు.