ఈసారి రెండు దశల్లో ఎన్నికల నిర్వహణ
విలేకరుల సమావేశంలో సీఎం ఏక్‌నాథ్ శిందే వెల్లడి
ఎవరు ఎక్కడి నుంచి పోటీ అంశంపై త్వరలో ప్రకటిస్తాం
మాది సామాన్య ప్రజలకు ప్రాధాన్యమిచ్చే ప్రభుత్వం
ప్రజలు తమను ఆదరిస్తారని సీఎం శిందే ధీమా
దాదర్: అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబరు మొదటి వారంలో జరిగే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సారి ఎన్నికలు రెండు దశల్లో జరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. గణేశోత్సవాలు పురస్కరించుకుని శిందే అధికార నివాసమైన వర్షా బంగ్లాలో విలేకరులతో కొద్ది సేపు ముచ్చటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే వెల్లడించాల్సి ఉంది. కానీ వరుసగా వస్తున్న ఉత్సవాలు, పర్వదినాల కారణంగా వాయిదా వేయాల్సి వస్తోందని అన్నారు. అయినప్పటికీ తుది నిర్ణయం ఎన్నికల సంఘమే తీసుకుంటుందని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమిలో ఎవరు ఎన్ని స్థానాలపై, ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంపై వారం, పది రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సంకేతాలిచ్చారు. తమ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. ఈ పథకాలను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని శిందే ధీమా వ్యక్తం చేశారు. అయితే సీట్ల పంపకం విషయంలో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తామన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్, మే లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వచి్చన ఫలితాలను ప్రధాన అం«శంగా పరిగణించి మెరిట్, స్ట్రైక్ రేట్ బేసిక్‌పై సీట్ల పంపిణీ చేపడతామని శిందే స్పష్టం చేశారు. ప్రస్తుతం సీట్ల పంపకంపై ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. మిత్రపక్షాల్లో కొందరి ఎక్కువ సీట్లు, మరికొందరికి తుక్కువ సీట్లు లభించవచ్చని అన్నారు. ఏ పార్టీకి, ఎక్కడ గెలిచే సత్తా ఉందో ఆ పారీ్టకే అక్కడ స్థానాలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన ఫార్ములా వచ్చే వారం లేదా పది రోజుల్లో పూర్తవుతుందని ఆయన వెల్లడించారు. అభ్యర్థిత్వం ఇచ్చేముందు మూడు పారీ్టలకు ఎక్కడెక్కడ మంచి పట్టు ఉందో ఆయా పార్టీల అభ్యర్థులను ఎంపికచేసి బరిలోకి దింపుతామని పేర్కొన్నారు. అభ్యర్థిత్వం ఇచ్చే ముందు అధ్యయనం చేపడతామని తెలిపారు. తమది సామాన్య ప్రజల ప్రభుత్వం, మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల తమ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లభిస్తుందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు ఓర్వలేక అనవసరంగా మహాయుతి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. (పని ఒత్తిడితో మహిళా ఉద్యోగి షాకింగ్ డెత్, స్పందించిన కేంద్రం)
కాంగ్రెస్‌కు 1,633 దరఖాస్తులు!
లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించడంతో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ)లో చాలా ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆశావహులు క్యూలు కడుతున్నారు. కొందరైతే ఇప్పటి నుంచే పైరవీలు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి నివేదికలు తెప్పించుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ వద్దకు 1,633 దరఖాస్తులు వచ్చాయి. అత్యధిక దరఖాస్తులు విదర్భ నుంచి (485), ఆ తర్వాత మరఠ్వాడా రీజియన్ నుంచి (325) నియోజక వర్గాల నుంచి రాగా అతి తక్కువ కొంకణ్ రీజియన్ నుంచి (123) దరఖాస్తులు వచ్చాయి. అదే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 476 దరఖాస్తులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దీన్ని బట్టి 2019తో పోలిస్తే ఈ సారి జరిగే అసెంబీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల్లో ఆసక్తి పెరిగినట్లు స్పష్టమవుతోంది. అధికార మహా అఘాడీకి చెందిన కొందరు సభ్యులు కూడా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. కానీ వారి పేర్లు ఇప్పుడే బయట పెట్టలేమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనేక మంది ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ వారి ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను బట్టి ఎంపిక చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో వచి్చన దరఖాస్తుల్లో కొన్నింటినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో కొందరు తిరుగుబాటు చేసే ప్రమాదం కూడా ఉంది. దీంతో ఎంవీఏ నేతలు ఆచితూచి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: సుశీల్‌కుమార్ శిందే మనవడు, జాన్వీ బాయ్‌ఫ్రెండ్ రాజకీయాల్లోకి!
Comments
Please login to add a commentAdd a comment