cement bricks
-
ట్రాక్‌పై సిమెంట్ దిమ్మలు.. మరో రైలుకు తప్పిన ప్రమాదం
జైపూర్: రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలును పట్టాలు తప్పించేందుకు దుండగులు ప్రయత్నించారు. ఆదివారం(సెప్టెంబర్8) జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్రాక్‌పై ఏకంగా రెండు భారీ సిమెంట్ దిమ్మలను ఉంచారు. ఈ సిమెంట్ దిమ్మలు ఒక్కోటి 70 కిలోల బరువున్నవి కావడం గమనార్హం.రైలు ఎప్పటిలానే ఆ రూట్లో వచ్చింది. సిమెంట్ దిమ్మలను ఢీకొట్టింది. అయినా రైలు పట్టాలు తప్పకుండా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు కేసు పెట్టారు. సిమెంట్ దిమ్మలు ట్రాక్ మీద ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే రైలు ఢీకొని ఒక సిమెంట్ దిమ్మ పగిలిపోగా మరొకటి ట్రాక్‌పైనే కొంత దూరం జరిగి ఉంది.ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, యూపీ కాన్పూర్‌లోని అన్వర్గంజ్-కాస్గంజ్ మార్గంలో కాళింది ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించేందుకు సిలిండర్ ఉంచిన ఘటన తాజాగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదీ చదవండి: రైలు పట్టాలపై సిలిండర్..ఉగ్రవాదుల పనేనా..? -
సిమెంట్ ఇటుకల మాటున ‘ఎర్ర’దుంగల స్మగ్లింగ్
నెల్లూరు: సిమెంట్ ఇటుకల మాటున ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, అటవీ శాఖ అధికారులు 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆసిలివలస ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ట్రాక్టర్లో సిమెంట్ బ్రిక్స్ మధ్యలో ఉంచి తీసుకెళ్తున్న రూ. 10 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
సచివాలయం నిర్మాణ పనుల్లో ప్రమాదం
-
తాత్కాలిక సచివాలయంలో కూలిన గోడ
సాక్షి, అమరావతి : తాత్కాలిక సచివాలయంలోని మొదటి భవనం మొదటి అంతస్తులో సైడ్ గోడ కూలి జార్ఖండ్‌కు చెందిన ఐదుగురు కూలీలు గాయపడ్డారు. మొదటి అంతస్తు చివరి భాగం కుడి వైపున అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సిమెంట్ ఇటుకలతో గోడ నిర్మిస్తుండగా ఉన్నట్లుండి కూలింది. ఆ సమయంలో అక్కడే పని చేస్తున్న దేవేందర్‌పై ఇటుకలు పడటంతో వెన్నెముక, కాలు విరిగింది. రామచంద్ర ఓకై కాలు, చెయ్యి విరగడంతో పాటు తలకు తీవ్రగాయమైంది. ధర్మేంద్ర, జాయరాం, కిషోర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరందరినీ హుటాహుటిన మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. కాగా, తాత్కాలిక సచివాలయం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. నిర్మాణ పనుల కోసం పశ్చిమబెంగాల్, ఒడిశా, రాజస్థాన్, జార్ఖండ్, తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చారు. మే నెలలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందడంతో పని ఒత్తిడి పెరిగిందని, భద్రత లేదని కూలీలంతా ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మరో కూలీ మృతి చెందాడు. ఈ ప్రాంతం లూజ్ సాయిల్ కావడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలోనే మందడం గ్రామంలో నిర్మాణంలో ఉన్న గోపిరెడ్డి భవనం కుంగిపోవడం కలకలం రేపింది. ఆ తర్వాత తాత్కాలిక సచివాలయం రెండవ భవనం గ్రౌండ్‌ఫ్లోర్ కింది భాగం కుంగింది. ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి మరమ్మతులు చేశారు. -
నాణ్యత తా‘కట్టు’
=సింగరేణి క్వార్టర్ల నిర్మాణానికి నాసిరకం ఇసుక =కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం =చోద్యం చూస్తున్న ఇంజినీర్లు సాధారణంగా చిన్నపాటి ఇల్లు కట్టుకున్నా పది కాలాల పాటు నిలబడాలని కోరుకుం టాం.. అందుకు గోదావరి ఇసుక వాడుతాం. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి క్వార్టర్ల నిర్మాణం. పనులకు వాడుతున్నది లోకల్ ఇసుక. ఎర్రని దుబ్బను తలపిస్తోం ది. సున్నం వేసినట్లు తెల్లగా మెరుస్తున్న పిల్లర్లు. వాడకముందే పగిలిపోతున్న సిమెంటు ఇటుకలు. ఈ తరహాలో నిర్మించిన కట్టడాలు ఎన్నికాలాలుంటాయో తెలి యదు. నాణ్యతలేని నిర్మాణాలు భవిష్యత్‌లో కార్మికులకు శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పనులను స్వయంగా చూసిన గుర్తింపు సంఘం నాయకుడు అప్పాని శ్రీనివాస్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. గణపురం(వరంగల్), న్యూస్‌లైన్ : సింగరేణి కార్మికులకు గృహవసతి కల్పించడానికి యాజమాన్యం చేపట్టిన క్వార్టర్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. మండలంలోని చెల్పూరు శివారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో కంపెనీ సేకరించిన 160 ఎకరా ల స్థలంలో 1,000 మంది కార్మికులు నివాసం ఉండడానికి సరిపోను క్వార్టర్లు నిర్మిస్తున్నారు. 2011 ఏప్రిల్ 11న అప్పటి సీఎండీ నర్సింగరావు శంకుస్థాపన చేయగా నిర్మాణానికిసంస్థ రూ.74 కోట్లు కేటాయించింది. వాస్తవానికి 2013 డిసెంబర్ నాటికి క్వార్టర్ల నిర్మాణం పూర్తికావల్సి ఉంది. ఇప్పటికీ 300 క్వార్టర్లు కూడా పూర్తి కాలేదు. కార్మికుల్లో ఆందోళన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కార్మికులు ఆందోళ న చెందుతున్నారు. వాగులు, వంకల్లో లభించే నాసిరకం ఇసుకతో పనులు చేపడుతుండడంతో అవి ఎంతకాలం నిలుస్తాయోనని భయపడుతున్నారు. కాంట్రాక్టర్ లోకల్ ఇసుక వాడుతున్నా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా అతడి ని వెనకేసుకొస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం క్వార్టర్లను పరిశీ లించడానికి వచ్చిన భూపాలపల్లి సీఈ శివరావు దృష్టికి తీసుకువెళ్లినా సరైన సమాధానం రాలేదని పేర్కొంటున్నారు. పట్టుకుంటేనే పగిలిపోతున్న సిమెంట్ఇటుకలు క్వార్టర్ల నిర్మాణాలకు ఉపయోగించడానికి తీసుకు వచ్చిన సిమెంటు ఇటుకలు చేయితో పట్టుకుంటేనే పలిగిపోతున్నాయి. 40వేల ఇటుకల వరకు దిగుమ తి చేసి ఉన్నాయి. వాటిని ఎట్టిపరిస్థితుల్లో వినియోగించమని పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు చెబుతుండగా కాంట్రాక్టరు తరఫు ప్రతినిధి మాత్రం వాటినే వాడుతామంటున్నాడు. నిర్మాణాలకు వాట ర్ క్యూరింగ్ సక్రమంగా లేదు. పనులను పర్యవేక్షిం చాల్సిన సూపర్వైజర్లు పట్టించుకోవడంలేదు. నిర్మాణాలకు వాడుతున్నది మట్టే కార్వర్టర్ల నిర్మాణ పనులకు వాడుతున్నది ఇసుక అంటే ఎ వరైనా నవ్విపోతారు. యాభైశాతం మట్టి ఉన్న దు బ్బను ఇసుక అని అనవచ్చా. మామూలుగా చిన్న గది నిర్మించుకుంటేనే నాణ్యమైన గోదావరి ఇసుక వాడుతాం. అలాంటి రూ.కోట్లు వెచ్చించి ని ర్మిస్తున్న క్వార్టర్లకు దుబ్బలాంటి ఇసుక వాడటం దారు ణం. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న ఇంజినీర్లపై చర్య తీసుకోవాలి. గోదావరి ఇసుకతో నే నిర్మాణాలు చేపట్టాలి. నాణ్యత లేని ఇటుకలను అక్కడి నుంచి తొలగిం చాలి. ఈ విషయాన్ని సింగరేణి సీఎండీతోపాటు ఏరియా జీఎం దృష్టికి తీసుకుపోతాం. కాంట్రాక్టర్ ధోరణి, అధికారుల తీరు మారకుంటే కార్మికులతో ధర్నా చేస్తాం. - అప్పాని శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు