=సింగరేణి క్వార్టర్ల నిర్మాణానికి నాసిరకం ఇసుక
=కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
=చోద్యం చూస్తున్న ఇంజినీర్లు
సాధారణంగా చిన్నపాటి ఇల్లు కట్టుకున్నా పది కాలాల పాటు నిలబడాలని కోరుకుం టాం.. అందుకు గోదావరి ఇసుక వాడుతాం. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి క్వార్టర్ల నిర్మాణం. పనులకు వాడుతున్నది లోకల్ ఇసుక. ఎర్రని దుబ్బను తలపిస్తోం ది. సున్నం వేసినట్లు తెల్లగా మెరుస్తున్న పిల్లర్లు. వాడకముందే పగిలిపోతున్న సిమెంటు ఇటుకలు. ఈ తరహాలో నిర్మించిన కట్టడాలు ఎన్నికాలాలుంటాయో తెలి యదు. నాణ్యతలేని నిర్మాణాలు భవిష్యత్‌లో కార్మికులకు శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పనులను స్వయంగా చూసిన గుర్తింపు సంఘం నాయకుడు అప్పాని శ్రీనివాస్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
గణపురం(వరంగల్), న్యూస్‌లైన్ : సింగరేణి కార్మికులకు గృహవసతి కల్పించడానికి యాజమాన్యం చేపట్టిన క్వార్టర్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. మండలంలోని చెల్పూరు శివారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో కంపెనీ సేకరించిన 160 ఎకరా ల స్థలంలో 1,000 మంది కార్మికులు నివాసం ఉండడానికి సరిపోను క్వార్టర్లు నిర్మిస్తున్నారు. 2011 ఏప్రిల్ 11న అప్పటి సీఎండీ నర్సింగరావు శంకుస్థాపన చేయగా నిర్మాణానికిసంస్థ రూ.74 కోట్లు కేటాయించింది. వాస్తవానికి 2013 డిసెంబర్ నాటికి క్వార్టర్ల నిర్మాణం పూర్తికావల్సి ఉంది. ఇప్పటికీ 300 క్వార్టర్లు కూడా పూర్తి కాలేదు.
కార్మికుల్లో ఆందోళన
నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కార్మికులు ఆందోళ న చెందుతున్నారు. వాగులు, వంకల్లో లభించే నాసిరకం ఇసుకతో పనులు చేపడుతుండడంతో అవి ఎంతకాలం నిలుస్తాయోనని భయపడుతున్నారు. కాంట్రాక్టర్ లోకల్ ఇసుక వాడుతున్నా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా అతడి ని వెనకేసుకొస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం క్వార్టర్లను పరిశీ లించడానికి వచ్చిన భూపాలపల్లి సీఈ శివరావు దృష్టికి తీసుకువెళ్లినా సరైన సమాధానం రాలేదని పేర్కొంటున్నారు.
పట్టుకుంటేనే పగిలిపోతున్న సిమెంట్ఇటుకలు
క్వార్టర్ల నిర్మాణాలకు ఉపయోగించడానికి తీసుకు వచ్చిన సిమెంటు ఇటుకలు చేయితో పట్టుకుంటేనే పలిగిపోతున్నాయి. 40వేల ఇటుకల వరకు దిగుమ తి చేసి ఉన్నాయి. వాటిని ఎట్టిపరిస్థితుల్లో వినియోగించమని పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు చెబుతుండగా కాంట్రాక్టరు తరఫు ప్రతినిధి మాత్రం వాటినే వాడుతామంటున్నాడు. నిర్మాణాలకు వాట ర్ క్యూరింగ్ సక్రమంగా లేదు. పనులను పర్యవేక్షిం చాల్సిన సూపర్వైజర్లు పట్టించుకోవడంలేదు.
నిర్మాణాలకు వాడుతున్నది మట్టే
కార్వర్టర్ల నిర్మాణ పనులకు వాడుతున్నది ఇసుక అంటే ఎ వరైనా నవ్విపోతారు. యాభైశాతం మట్టి ఉన్న దు బ్బను ఇసుక అని అనవచ్చా. మామూలుగా చిన్న గది నిర్మించుకుంటేనే నాణ్యమైన గోదావరి ఇసుక వాడుతాం. అలాంటి రూ.కోట్లు వెచ్చించి ని ర్మిస్తున్న క్వార్టర్లకు దుబ్బలాంటి ఇసుక వాడటం దారు ణం. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న ఇంజినీర్లపై చర్య తీసుకోవాలి. గోదావరి ఇసుకతో నే నిర్మాణాలు చేపట్టాలి. నాణ్యత లేని ఇటుకలను అక్కడి నుంచి తొలగిం చాలి. ఈ విషయాన్ని సింగరేణి సీఎండీతోపాటు ఏరియా జీఎం దృష్టికి తీసుకుపోతాం. కాంట్రాక్టర్ ధోరణి, అధికారుల తీరు మారకుంటే కార్మికులతో ధర్నా చేస్తాం.
- అప్పాని శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు
నాణ్యత తా‘కట్టు’
Published Sat, Dec 28 2013 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement