లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్‌ఫారం ఎక్కించేశాడు.. | Uttar Pradesh: Train Derails, Climbs Platform At Mathura Railway Station | Sakshi
Sakshi News home page

లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్‌ఫారం ఎక్కించేశాడు..

Published Thu, Sep 28 2023 4:12 PM | Last Updated on Thu, Sep 28 2023 4:21 PM

Train Derails Climbs Platform At Mathura Railway Station Accident - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్లో ఓ లోకో పైలట్ వీడియో కాల్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆగిన రైలు కాస్తా ప్లాట్‌ఫారంపైకి ఎక్కి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళ విద్యుదాఘాతానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటపడగా అందులో లోకోపైలట్ భాగోతం బయటపడింది. 

వీడియోలో ఢిల్లీ షకుర్ బస్తీ నుంచి వచ్చిన ఎలెక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్(ఈఎంయూ) రైలు మధుర జంక్షన్ స్టేషన్‌కు చేరుకోగానే అప్పటివరకు విధులు నిర్వహించిన లోకోపైలట్ రైలు ఆగిన తర్వాత కిందకు దిగాడు. అంతలో మరో లోకో పైలట్ సచిన్ విధులు నిర్వహించేందుకు ఫోన్లో వీడియో కాల్ మాట్లాడుతో రైలులోకి ఎక్కాడు. వీడియో కాల్‌లో బిజీగా ఉన్న సచిన్ భుజానికున్న బ్యాగును తీసి ఇంజిన్ రాడ్ పైన పెట్టాడు. ఆ బరువుకు ఇంజిన్ హ్యాండిల్ ముందుకు కదలడంతో రైలు ముందుకు కదిలింది. 

ఇది గమనించకుండా సచిన్ వీడియో కాల్‌లో బిజీగా ఉన్నాడు. చూస్తుండగానే రైలు ప్లాట్‌ఫారంపైకి ఎక్కి ఎదురుగా ఉన్న కరెంటు స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఒక మహిళా మాత్రం విద్యుదాఅఘాతానికి గురవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రైలులోని ప్రయాణికులంతా రైలు దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటున్నారు అక్కడి వారు. దీని కారణంగా మాల్వా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, అమృత్‌సర్-బాంద్రా ఎక్స్‌ప్రెస్, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అంతరాయం కలిగింది. వెంటనే స్పందించిన రైల్వే యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సచిన్ తోపాటు మరో నలుగురిని కూడా సస్పెండ్ చేసింది.  

ఇది కూడా చదవండి: పాముకాటుతో అటెండర్‌ మానస మృతి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement