పట్టాలు తప్పిన గూడ్సు రైలు
నిజామాబాద్‌సిటీ: నిజామాబాద్ జిల్లాకేంద్రంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పింది. గూడ్సు రైలు చివరి బోగీ పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయింది. గూడ్సు రైలు ఇంజన్ సరిగ్గా బ్రిడ్జిపై నిలిచిపోయింది. కింద రోడ్డుపై బోగీ పడి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది. ప్రమాద సమాచారాన్ని రైలు డ్రైవర్ అధికారులకు చేరవేశాడు.