రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం
♦ మహారాష్ట్రలో గూడ్స్ బోల్తాతో సమస్య
♦ కేరళ, తమిళనాడు, జీటీ నిరవధిక ఆలస్యం
♦ అయ్యప్ప మాలధారులు, ప్రయాణికుల అవస్థలు
విజయవాడ(రైల్వేస్టేషన్) : రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులతో పాటు అయ్యప్ప మాలధారులు శనివారం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహారాష్ట్రలోని వీర్‌గావ్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు బోల్తా పడడంతో అటు నుంచి వచ్చే పలు రైళ్లు 20 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. బల్లార్షా మార్గం మీదుగా వచ్చే పలు రైళ్లు శుక్రవారం 20 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తున్నారుు. శుక్రవారం రావాల్సిన తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ 25 గంటలపైగా ఆలస్యంగా శనివారం రాత్రికి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బెంగళూరు వైపు సంఘమిత్ర, చెన్నై వెళ్లే గ్రాండ్ ట్రంక్(జీటీ), నవజీవన్ తదితర రైళ్లు నిరవధిక ఆలస్యంగా నడుస్తున్నాయి.
ప్రయాణికుల అవస్థలు..
శబరిమల వెళ్లే మాలధారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆహారం, తాగునీరుని అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. రైళ్ల రాకపోకలపై విచారణలో సరిైయెున సమాధానం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
24 గంటలుగా ఇబ్బందులు
తిరువనంతపురం వెళ్లే కేరళ ఎక్స్‌ప్రెస్ 25 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తుండడంతో తీవ్ర ఇబ్బందిగా ఉంది. రైలు కోసం శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చాం. ఇప్పటి వరకు రైలు రాలేదు. విచారణ కేంద్రాల వద్ద సరైన సమాచారం రావడం లేదు. రైళ్లు వచ్చే వరకు తగిన వసతులు కల్పించాలి.
-రాజు. అయ్యప్ప మాలధారుడు