రామాయంపేట(మెదక్): మెదక్–అక్కన్నపేట మధ్య మొదటిసారిగా శనివారం గూడ్స్ రైలు నడిచింది. పట్టాల మధ్యన కంకరను గూడ్స్‌లో తరలించినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. మండలంలోని అక్కన్నపేట స్టేషన్ నుంచి నాలుగైదు కిలోమీటర్ల మేర పట్టాలపై కంకరపరిచారు. గూడ్స్‌లో కంకరను ఇక్కడికి తరలించారు.
క్లియరెన్స్ రాకపోవడంతో సదరు గూడ్సును రెండు గంటలపాటు అక్కన్నపేట స్టేషన్‌లోనే నిలిచి పోయింది. సేఫ్టీ అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే గూడ్స్ కదిలింది. నూతనంగా నిర్మించిన బ్రిడ్జిల వద్ద రైలు నెమ్మదిగా వెళ్లింది. అంతకుముందు రైలు ఎదుట పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment