విడిపోయిన గూడ్స్ రైలు 40 బోగీలు
యలమంచిలి(విశాఖపట్టణం జిల్లా): ప్రమాదవ శాత్తు లైమ్‌స్టోన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి 40 బోగీలు విడిపోయాయి. ఈ సంఘటన మంగళవారం విశాఖ జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. అయితే విడిపోయిన 40 బోగీలు పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది.
విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బోగీలను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నారు.