wagons
-
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
ముంబై మెట్రోకు ‘శ్రీసిటీ’ బోగీలు
వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): ముంబై మెట్రో లైన్–3 ప్రాజెక్టుకు శ్రీసిటీలో ఆల్స్టామ్ పరిశ్రమ ఉత్పత్తి చేస్తున్న రైలు బోగీలను వాడనున్నారు. ఈ మేరకు మెట్రో ప్రాజెక్టుతో ఒప్పందం కుదిరినట్లు ఆల్స్టామ్ ఇండియా, దక్షిణాసియా ఎండీ అలెన్ స్ప్యార్ చెప్పారు. నిర్ధేశిత సమయంలో 8 బోగీలుండే 31 ట్రైన్ సెట్లను అందజేస్తామని, వీటి తయారీని కూడా ఆరంభించామని అలెన్ స్ప్యార్ చెప్పారు. శ్రీసిటీ ప్లాంట్‌లో వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 240 నుంచి 480 రైళ్లకు చేర్చేందుకు తాము శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ చెన్నై మెట్రో, మాంట్రియల్ మెట్రో(కెనడా), ముంబై మెట్రో లైన్–3 ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తి జరుగుతోందన్నారు. సిడ్నీకి చెందిన మరో ప్రాజెక్టు ఒప్పందం కూడా జరిగిందని తెలియజేశారు. -
విడిపోయిన గూడ్స్ రైలు 40 బోగీలు
యలమంచిలి(విశాఖపట్టణం జిల్లా): ప్రమాదవ శాత్తు లైమ్‌స్టోన్ లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు నుంచి 40 బోగీలు విడిపోయాయి. ఈ సంఘటన మంగళవారం విశాఖ జిల్లా యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. అయితే విడిపోయిన 40 బోగీలు పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. విడిపోయిన గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని బోగీలను తిరిగి కలిపే ప్రయత్నం చేస్తున్నారు.