న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు.
ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment