Hindalco Industries
-
ప్రముఖ సంస్థపై సీబీఐ కేసు నమోదు
ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కోపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2011–13 మధ్య కాలంలో బొగ్గు తవ్వకాల కోసం పర్యావరణ అనుమతులు పొందడంలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చినట్లు తెలిపింది. తీవ్ర కాలుష్యం ఉన్న ఒడిశా జార్సుగూడ ప్రాంతంలోని తలబిరా–1 గనిలో హిందాల్కో ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని విచారణ అనంతరం సీబీఐ పేర్కొంది.తలబిరా-1 గనిలో మైనింగ్‌ను అనుమతించడంలో నిపుణుల అంచనా కమిటీ (ఈఏసీ) కార్యదర్శి హోదాలో కంపెనీకి అనుకూలంగా వ్యవహరించిన అప్పటి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌గా ఉన్న టి.చాందిని పేరును సీబీఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ 2011–13 మధ్య బొగ్గు తవ్వకాలకు తప్పనిసరి పర్యావరణ అనుమతులు పొందేందుకు మంత్రిత్వ శాఖ అధికారులకు భారీగా లంచాలు చెల్లించిందనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 2016లో ప్రాథమిక విచారణ జరిపింది. పరిమితికి మించి 30 లక్షల టన్నుల బొగ్గును అదనంగా వెలికితీశారని వెల్లడించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120–బి (నేరపూరిత కుట్ర), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల ప్రకారం హిందాల్కో, అప్పటి డైరెక్టర్ చాందినిలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.ఇదీ చదవండి: 16.8 లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా!ఇదిలాఉండగా, ఈ విషయంపై హిందాల్కో స్పందించింది. ‘ఇది 2014–15కి సంబంధించిన పాత విషయం. ప్రభుత్వం చేపట్టిన గనుల కేటాయింపుల రద్దు ప్రక్రియలో భాగంగా వాటిని ఎప్పుడో ప్రభుత్వం తీసుకుంది. 100కు పైగా గనుల కేటాయింపులు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే’ అని సంస్థ ప్రతినిధి తెలిపారు. -
హిందాల్కో లాభం జూమ్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 71 శాతం జంప్‌చేసి రూ. 2,331 కోట్లను తాకింది. అల్యూమినియం, కాపర్ విభాగాలు పటిష్ట పనితీరు చూపడం లాభాలకు దోహదం చేసింది. గతేడాది (2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 1,362 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 53,151 కోట్ల నుంచి 52,808 కోట్లకు బలహీనపడింది. కఠిన మార్కెట్ పరిస్థితుల్లోనూ వృద్ధి బాటలో సాగినట్లు కంపెనీ ఎండీ సతీష్ పాయ్ తెలియజేశారు. అల్యూమినియం, కాపర్ బిజినెస్‌లు ఆకర్షణీయ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఇందుకు మెరుగైన ప్రొడక్ట్ మిక్స్, తగ్గిన ముడివ్యయాలు సహకరించినట్లు వెల్లడించారు. ఈ రెండు విభాగాల విస్తరణపై పెట్టుబడులను కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి ఈ ఏడాది రూ. 4,500 కోట్లు వెచ్చిస్తున్నట్లు ప్రస్తావించారు. వచ్చే ఏడాది(2024–25) పెట్టుబడులను రూ. 5,500 కోట్లకు పెంచనున్నట్లు తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో హిందాల్కో షేరు బీఎస్ఈలో 12.5 శాతం పతనమై రూ. 510 వద్ద ముగిసింది. -
ఎక్స్‌ట్రూజన్‌పై హిందాల్కో దృష్టి
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ రవాణా వ్యాగన్లు, కోచ్‌ల తయారీకి వీలుగా ఎక్స్‌ట్రూజన్ సౌకర్యాలపై పెట్టుబడులకు సిద్ధపడుతోంది. దీంతోపాటు కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లపై మొత్తం రూ. 4,000 కోట్లవరకూ వెచి్చంచేందుకు ప్రణాళికలు వేసినట్లు కంపెనీ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా తాజాగా పేర్కొన్నారు. ప్రధానంగా వందే భారత్ రైళ్ల కోచ్‌లకోసం ఎక్స్‌ట్రూజన్ ప్లాంటు ఏర్పాటుకు రూ. 2,000 కోట్లు వెచి్చంచనున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో కాపర్, ఈవేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు మరో రూ. 2,000 కోట్లు పెట్టుబడులు కేటాయించనున్నట్లు కంపెనీ 64వ వార్షిక వాటాదారుల సమావేశం(ఏజీఎం)లో తెలియజేశారు. కంపెనీ ఇప్పటికే అధిక వేగం, అధిక లోడ్‌కు వీలున్న పూర్తి అల్యూమినియంతో తయారయ్యే తేలికపాటి రేక్‌ల నిర్మాణంలో పాలు పంచుకుంటోంది. ఇక సిమెంట్ బ్యాగులు, ఆహారధాన్యాలు తదితరాల కోసం మరో మూడు డిజైన్లతో రవాణా వ్యాగన్లను రూపొందించేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటున్న నేపథ్యంలో ఇతర సంస్థల సహకారంతో బ్యాటరీ ఎన్‌క్లోజర్స్, మోటార్ హౌసింగ్స్ తదితర కీలక విడిభాగాల తయారీ, అభివృద్ధిని చేపట్టనున్నట్లు బిర్లా వివరించారు. -
హిందాల్కో ఇండస్ట్రీస్ నుంచి అల్యుమినియం ఎయిర్ బ్యాటరీలు
-
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్, బ్యాటరీల తయారీలోకి హిందాల్కో!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల కోసం అల్యుమినియం–ఎయిర్ బ్యాటరీల తయారీ విభాగంలోకి ప్రవేశించనున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ వెల్లడించింది. ఇందుకోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఫినర్జీ, ఐవోపీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఫినర్జీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కలిసి ఐవోసీ ఫినర్జీ ప్రైవేట్ లిమిటెడ్ (ఐవోపీ)ని ఏర్పాటు చేశాయి. తక్కువ బరువుండి, అధిక స్థాయిలో విద్యుత్‌ను నిల్వ చేయగలిగే సామర్థ్యం అల్యుమినియం–ఎయిర్ బ్యాటరీలకు ఉంటుంది. అలాగే వేగవంతంగా చార్జ్ కూడా అవుతాయి. దీంతో ఖరీదైన చార్జింగ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయాల్సిన భారం తప్పుతుంది, అలాగే ఈ బ్యాటరీలున్న ఎలక్ట్రిక్ వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించగలవు. అల్యుమినియం–ఎయిర్ బ్యాటరీలకు అవసరమయ్యే అల్యుమినియం ప్లేట్ల తయారీ, బ్యాటరీల్లో ఉపయోగించిన తర్వాత వాటిని రీసైక్లింగ్ చేయడం మొదలైన అంశాలకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల్లో హిందాల్కోతో కలిసి ఫినర్జీ, ఐవోపీ పనిచేస్తాయి. -
హిందాల్కో లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ. 3,851 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,928 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 40,507 కోట్ల నుంచి రూ. 55,764 కోట్లకు జంప్ చేసింది. పటిష్ట సామర్థ్య నిర్వహణ, వినియోగం తదితరాలు సహాయంతో క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. వెరసి ప్రపంచంలోనే చౌకగా అల్యూమినియం తయారీ, అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్లు ఆర్జిస్తున్న కంపెనీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. -
హిందాల్కో లాభం డౌన్..
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు 36 శాతం తగ్గి రూ.160 కోట్లకు దిగింది. ఇక నికర అమ్మకాలు రూ.8,360 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.9,219 కోట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 35 శాతం క్షీణించి రూ.925 కోట్లకు, నికర అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ.34,094 కోట్లకు చేరాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో హిందాల్కో షేర్ బీఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ.132 వద్ద ముగిసింది.