హిందాల్కో లాభం డౌన్..
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ, హిందాల్కో ఇండస్ట్రీస్ నికర లాభం(స్టాండోలోన్) గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్‌కు 36 శాతం తగ్గి రూ.160 కోట్లకు దిగింది. ఇక నికర అమ్మకాలు రూ.8,360 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.9,219 కోట్లకు పెరిగాయని కంపెనీ పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 35 శాతం క్షీణించి రూ.925 కోట్లకు, నికర అమ్మకాలు 24 శాతం వృద్ధి చెంది రూ.34,094 కోట్లకు చేరాయని పేర్కొంది. ఒక్కో షేర్‌కు రూ.1 డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యలో హిందాల్కో షేర్ బీఎస్‌ఈలో 1.5 శాతం క్షీణించి రూ.132 వద్ద ముగిసింది.