న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ మెటల్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2021–22) చివరి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెట్టింపై రూ. 3,851 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 1,928 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 40,507 కోట్ల నుంచి రూ. 55,764 కోట్లకు జంప్ చేసింది. పటిష్ట సామర్థ్య నిర్వహణ, వినియోగం తదితరాలు సహాయంతో క్యూ4లో కంపెనీ చరిత్రలోనే అత్యధిక లాభాలు ఆర్జించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. వెరసి ప్రపంచంలోనే చౌకగా అల్యూమినియం తయారీ, అత్యధిక నిర్వహణ లాభ మార్జిన్లు ఆర్జిస్తున్న కంపెనీగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment