
అన్నానగర్ (చెన్నై): సెల్ఫీ పిచ్చితో మరో యువకుడు ప్రా ణాలు కోల్పోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవైకు చెందిన సుజీస్(18) ఓ కాలేజీలో బీకామ్ చదువుతున్నాడు. సెల్ఫీల పిచ్చి ఉన్న సుజీస్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై వెళుతుండగా ఓ గూడ్సు రైలు వస్తూ కన్పించింది. దీంతో పట్టాల దగ్గరకు వెళ్లిన సుజీస్, సెల్ఫీలు తీసుకోవడం ప్రారంభించాడు. రైలు సమీపిస్తున్నా పక్కకు వెళ్లకపోవడంతో గూడ్సు రైలు వ్యాగన్ అతని తలను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సుజీస్‌ను స్నేహితులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కోవై ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. కాగా, రైలు పట్టాలపై యువత సెల్ఫీలు, విన్యాసాలు లాంటి ప్రమాదకర పనులు చేయవద్దని రైల్వే మంత్రి గోయల్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment