
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 70 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట) చోటుచేసుకుంది. 8 మంది సిబ్బంది, 139 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలు, ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.
న్యూయార్క్ నుంచి మియామికి ప్యాసింజర్ ట్రెయిన్ వెళుతుండగా దక్షిణ కరోలినా వద్ద ఒక గూడ్స్ రైలును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 5వేల గ్యాలన్ల ఇంధనం లీకయింది. స్థానికులకు దీని ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు సమావేశమై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment