పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | - | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Published Sat, Jul 27 2024 12:58 AM | Last Updated on Sat, Jul 27 2024 8:57 AM

-

భువనేశ్వర్‌: భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో శుక్రవారం గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని, ఆస్తి నష్టం జరగలేదని తూర్పు కోస్తా రైల్వే అధికారులు వెల్లడించారు. రైలులోని రెండు వ్యాగన్లు పట్టాలు నుంచి జారడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. వాణి విహార్‌ పాసింజరు హాల్టు స్టేషను వద్ద రైలు కటక్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాజా ఘటన నేపథ్యంలో మధ్య, ఎగువ లైన్లు ప్రభావితం కాలేదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని తూర్పు కోస్తా రైల్వే ఽపేర్కొంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement