గూడ్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
Published Fri, Dec 2 2016 11:06 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
విజయనగరం: విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద శుక్రవారం ఉదయం గూడ్స్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కుర్దా నుంచి విశాఖకు వస్తున్న గూడ్స్ రైలు వీల్ యాక్సిల్ నుంచి మంటలు చెలరేగడంతో లోకో పైలట్ గమనించి చీపురుపల్లి వద్ద రైలును నిలిపివేశాడు. ఈ విషయం తెలుసుకున్న విశాఖపట్టణం డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ ఘటనాస్ధలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతోనే పెను ప్రమాదం తప్పిందని ఆమె తెలిపారు. మరమ్మత్తుల అనంతరం రైలు తిరిగి మధ్యాహ్నం బయలుదేరుతుందని అధికారులు వెల్లడించారు.
Advertisement
Advertisement