నడుపుతున్న రైల్లోనే ఆగిన డ్రైవర్ గుండె
Published Sun, Jul 12 2015 8:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:23 AM
నెల్లూరు(వేటపాలెం): నడుపుతున్న గూడ్సు రైల్లోనే ఆ డ్రైవర్ గుండె ఆగిపోయింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట నుంచి విజయవాడ వైపు (ద్వారపూడి) వెళుతున్న గూడ్సు డ్రైవర్ రైల్లోనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఇద్దరు డ్రైవర్లు రైల్లోనే టిఫిన్ తిన్నారు. పదినిమిషాల తరువాత గూడ్సు ప్రకాశం జిల్లా చిన్నగంజాం స్టేషన్ దగ్గర ఉండగా ఇంజిన్ క్యాబిన్‌లో ఉన్న ఒక డ్రైవర్ వి.సూర్యప్రకాశ్ (45)కు గుండెల్లో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని పక్కనున్న డ్రైవర్ హరికి చెప్పి ఇంజిన్ క్యాబిన్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే హరి వేటపాలెం స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. రైలు వేటపాలెం చేరుకోగానే సూర్యప్రకాశ్‌ను ప్లాట్‌ఫారంపైకి దించారు. 108 సిబ్బంది పరీక్షించి సూర్యప్రకాశ్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు.
Advertisement
Advertisement