train driver
-
క్వీన్స్ ఎక్స్‌ప్రెస్
‘టికెట్ కలెక్టర్‌గా అమ్మాయి!’‘ట్రైన్ డ్రైవర్ అమ్మాయట!’‘ట్రైన్ గార్డ్‌గా అమ్మాయి!’... ఇలాంటి ఎన్నో ఆశ్చర్యాలను చూసింది కాలం.వివిధ హోదాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్న వారిని చూసి గర్వించింది కాలం.పరుగెత్తే కాలంలో ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఆరోజు అచ్చంగా అలాంటిదే! కాస్త సరదాగా చెప్పుకోవాలంటే ‘కన్నుల పండగ’ అనేది పండగరోజు మాత్రమే రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక దినాలలో కూడా రావచ్చు. మొన్నటి మహిళా దినోత్సవం రోజు అలాంటి కన్నుల పండగ జరిగింది.సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ అందరూ మహిళలే ఉన్న బృందానికి ముంబై–పుణె దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించే బాధ్యతను అప్పగించింది. ఆరోజు ఆ ట్రైన్‌లోకి అడుగు పెడితే...డ్రైవర్ సీట్లో దర్జాగా కూర్చున్న లోకో–పైలట్ సురేఖ యాదవ్, టికెట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న నీతు, రుబినా, బీనా, సురక్ష, జెన్, దీపలతో రైలు కొత్తగా కనిపించింది.‘ఈరోజు నిజంగా మరిచిపోలేని రోజు. రైలును మహిళలే నడిపిస్తున్నారనే భావన గర్వంగా ఉంది. నా వృత్తిజీవితంలో ఇది గుర్తుంచుకోదగిన రోజు’ అంటుంది లోకో–పైలట్ సురేఖ యాదవ్. లోకో–పైలట్‌గా వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడానికి ముందు...‘అది కఠినమైన వృత్తి. ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. మహిళలకు ఎంతమాత్రం సరిపడని వృత్తి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు.వాటిని పట్టించుకొని ఉంటే ఆమె పేరు పక్కన ‘లోకో–పైలట్’ అనే విశేషణం గర్వంగా కాలర్ ఎగరేసేది కాదు.‘ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావాలి’ అంటుంది అసిస్టెంట్–లోకో పైలట్ లీనా ఫ్రాన్సిస్. చిన్నప్పుడెప్పుడో ట్రైన్ ముందు బోగీలో గంభీరంగా కూర్చున్న డ్రైవర్‌ను చూసిన తరువాత తాను కూడా డ్రైవర్ కావాలనుకుంది.‘అలా కుదరదు. వీలు కాదు’ అనే మాటల మధ్య కూడా తన ఆశను కోల్పోలేదు.వృత్తిజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ‘హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం కాకుండా ఈ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు తల్లీ. ట్రైన్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. జాగ్రత్త’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. శుభమా అని ఉద్యోగంలోకి అడుగు పెడుతుంటే ఈ మాటలేమిటని లీనా ఫ్రాన్సిస్ చిన్న బుచ్చుకోలేదు. ‘వాళ్లంతేలే!’ అని మాత్రమే అనుకుంది.సురేఖ యాదవ్ నుంచి రుబినా వరకు తమకు ఇష్టమైన వృత్తిలోకి రావడానికి ముందు ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే ఈ బండి ప్రయాణికులనే కాదు వారి విజయాలను కూడా మోసుకుంటూ వెళ్లింది! -
రియల్ హీరో: ప్రాణత్యాగంతో 144 మందిని కాపాడాడు!
తన ప్రాణం పోతుందని తెలిస్తే.. ఎవరైనా భయపడతారు. తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, తన ప్రాణం పోయినా.. ఇతరులను కాపాడాలని చూసేవాళ్లను ఏం అనాలి?. రియల్ హీరో అనడం ఎంతమాత్రం తక్కువ కాదు. క్షణాల్లో ఘోర ప్రమాదం జరుగుతుందని తెలిసి.. తన ప్రాణం పోయిన పర్వాలేదనుకుని వంద మందికి పైగా ప్రాణాలు నిలబెట్టాడు యాంగ్ యోంగ్. దక్షిణ చైనాలో హైస్పీడ్ బుల్లెట్ రైలు డీ2809 శనివారం ప్రమాదానికి గురైంది. గుయిజౌ ప్రావిన్స్‌లో బుల్లెట్ రైలు ప్రమాదానికి గురికాగా.. డ్రైవర్ కోచ్ నుజ్జునుజ్జు అయ్యి అందులోని డ్రైవర్ యాంగ్ యోంగ్ ప్రాణం విడిచాడు. ప్రమాదంలో మరో ఎనిమిది మంది గాయపడగా.. 136 మంది సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేపట్టిన అధికారులకు.. ట్రైన్ డేటా ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. డీ2809 రైలు.. గుయియాంగ్ నుంచి రోంగ్జియాంగ్ స్టేషన్ల మధ్య ఒక టన్నెల్ వద్దకు చేరుకోగానే.. డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతోనే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు అధికారులు. అయితే.. టన్నెల్‌కు చేరుకునే ముందు ట్రాకుల మీద అసాధారణ పరిస్థితులను యాంగ్ గుర్తించాడు. వెంటనే.. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేశాడు. దీంతో ముందున్న బురద, మట్టి కుప్పలను బలంగా ఢీకొట్టి రైలు సుమారు 900 మీటర్ల దూరం జారుకుంటూ ముందుకు వెళ్లింది. ఆపై స్టేషన్ వద్ద బోల్తా పడడంతో డ్రైవర్ కోచ్ బాగా డ్యామేజ్ అయ్యింది. Train driver on D2809 "5 second braking" : Emergency braking becomes muscle memory, Yang Yong did everything he could pic.twitter.com/IkiMUvcknt — tigers tiger (@tigerstiger1) June 5, 2022 యోంగ్ బ్రేకులు గనుక వేయకుండా ఉంటే.. పూర్తిగా బల్లెట్రైలే ఘోర ప్రమాదానికి గురై భారీగా మృతుల సంఖ్య ఉండేది!. కానీ, యోంగ్ సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. తన ప్రాణం కన్నా ప్రయాణికులే ముఖ్యం అనుకున్నాడు. యోంగ్ నేపథ్యం.. ఆయన ఇంతకు ముందు సైన్యంలో పని చేశారు. రిటైర్ అయిన తర్వాత.. కో-డ్రైవర్‌గా, అసిస్టెంట్ డ్రైవర్‌గా, ఫోర్‌మ్యాన్‌గా, డ్రైవర్ ఇన్‌స్ట్రక్టర్‌గా, గ్రౌండ్ డ్రైవర్‌గా.. చివరికి ట్రైన్ డ్రైవర్‌గా బాధ్యతలు చేపట్టాడు. దేశం కోసం సేవలు అందించిన వీరుడు.. చివరకు జనాల ప్రాణాలను కాపాడడం కోసమే ప్రాణాలు వదిలాడు. యోంగ్ చేసిన త్యాగం.. ఆ దేశాన్ని కంటతడి పెట్టించింది. రియల్ హీరోగా ఆయన్ని అభివర్ణిస్తోంది. తనను తప్ప.. మిగతా అందరినీ కాపాడుకున్న ఆ హీరోను ఆరాధిస్తోంది ఇప్పుడు అక్కడ. యోంగ్ పార్థివదేహానికి అతని స్వస్థలం గుయిజౌలోని జున్యీ వద్ద ప్రభుత్వ లాంఛనాలతో ప్రజల కన్నీళ్ల మధ్య ఘనంగా జరిగింది. The heroic driver of #D2809 Yang Yong returned to his hometown of #Zunyi , #Guizhou , under the escort of the convoy. Locals spontaneously lined the way to bid farewell Welcome home heroes. 6月5日,D2809司机杨勇在车队护送下回到家乡贵州遵义。当地人自发夹道送别:“欢迎英雄回家!” pic.twitter.com/c8OokOdx24 — Michael Franklin ( 100% follow back) (@Michael04222710) June 6, 2022 -
పెరుగు కోసం ట్రైన్ ఆపిన లోకో పైలట్, తరువాత ఏం జరిగిందంటే..
లాహోర్: ట్రైన్‌ను ఎక్కడపడితే అక్కడ నిలిపివేయటం టెక్నికల్‌గా అంత సాధ్యమైన విషయం కాదు! ప్రారంభమైన స్టేషన్ నుంచి గమ్య స్థానం వరకు ఏయే స్టేషన్లలో నిలపాలో ముందుగానే షెడ్యూల్ తయారు చేసి ఉంటుంది. వ్యక్తిగత అసవరాల కోసం రైలును ఆపేందుకు వీలుండదు. అయితే ఓ రైలు లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ చేసిన పని తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పెరుగు తినాలనిపించి ఏకంగా ట్రైన్‌ను మధ్యలోనే నిలిపివేశాడు ఓ లోకో పైలట్ అలాగే అతని సహాయకుడు. చివరికి ఈ విషయం అధికారులకు తెలియడంతో వారిద్దరిని సస్పెండ్ చేశారు. అసలిది ఎక్కడ జరిగిందంటే.. లాహోర్ నుంచి దక్షిణ కరాచీ వైపు వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లోకో పైలట్ కన్హా స్టేషన్‌కు సమీపంలో ఆపారు. దీంతో అసిస్టెంట్ అసిస్టెంట్ లోకో పైలట్ ట్రైన్ దిగి పక్కనే ఉన్న షాప్‌లో పెరుగు తీసుకుని తిరిగి రైలు ఎక్కారు. అయితే ఈ దృశ్యాలన్నింటినీ అక్కడున్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విటర్లో పోస్టు చేశారు. దీంతో నెట్టింట్లో వైరల్‌గా మరింది. నెటిజన్లు ఈ ఘటనపై రైల్వే అధికారులను ప్రశ్నిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు. ‘అతని ధైర్యం చూడండి. రైలును మధ్యలో ఆపి పెరుగు కొంటున్నాడు. పెరుగు కోసం రైలు ఆపితే.. స్వీట్ కోసం విమానం వాడుతారా?.. పెరుగు కోసం ట్రైన్ ఆపుతావా?’.. అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై పాకిస్తాన్ రైల్వే మంత్రి అజం ఖాన్ స్వాతి స్పందించారు. ఇద్దరిని సస్పెండ్ చేయాలని పాకిస్తాన్ రైల్వేస్ లాహోర్ అడ్మినిస్టేషన్‌లను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు సహించబోమని, ఎవరైనా జాతీయ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోవడం నేరమని ఆయన హెచ్చరించారు. చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2021: మనోడు కాదు.. అయినా తెగ వెతికారు! Inter-city train driver in Lahore gets suspended after making unscheduled stop to pick up some yoghurt.#pakistan #Railway #ViralVideo pic.twitter.com/n6csvNXksQ — Naila Tanveer🦋 (@nailatanveer) December 8, 2021 -
రైలు డ్రైవర్‌కు గుండెపోటు.. తప్పిన పెను ప్రమాదం
తాడేపల్లి రూరల్: విధుల్లో ఉన్న డ్రైవర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సిగ్నల్ పడడం, సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పడమే కాకుండా డ్రైవర్ ప్రాణాలు సైతం నిలిచాయి. శుక్రవారం కృష్ణాకెనాల్ జంక్షన్లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న గూడ్స్ రైలు కృష్ణా కెనాల్ జంక్షన్లో 5వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీద సిగ్నల్ కోసం వేచి ఉంది. ఆ రైలు నడుపుతున్న డ్రైవర్ జె.హరికుమార్కు గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. మరో డ్రైవర్ గూడ్స్‌రైలు కిందకు దిగి చెక్ చేసుకుంటూ ఆ విషయాన్ని గమనించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ డి.రాజు ఈ విషయాన్ని గమనించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా డ్రైవర్‌ను రైలులో నుంచి దించి రెస్ట్రూమ్కు తీసుకెళ్లారు. 108 రాకపోవడంతో ఆటోలో వెంటనే అతడిని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించారు. అతడికి గుండెపోటు వచ్చిందని, మరో 30 నిమిషాలు ఆలస్యమైతే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇవీ చదవండి: గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే.. వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. -
రైలును ఆపి ఇంజన్ ఎదుటే..
ముంబై : రైలు డ్రైవర్ ఉన్నపళంగా రైలును ఆపివేసి ఇంజన్ ముందు మూత్రం పోసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్-విఠల్వాడి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళుతున్న ఈ రైలును డ్రైవర్ అర్థంతరంగా ఆపి ఇంజన్ ముందే మూత్రవిసర్జన చేయడాన్ని వీడియో తీసిన కొందరు దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల క్యాబిన్స్‌లో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. ఇలా చేయడం డ్రైవర్ తప్పు కాదని లోకోమోటివ్, ఇంజన్ సిబ్బంది కోసం టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయని భారత రైల్వేలదే తప్పని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, డ్రైవర్లు, గార్డుల క్యాబిన్లో టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయాలని మరో ట్విటర్ యూజర్ కోరారు. -
వర్షం..రైలు..ఓ గొడుగు-వైరల్ వీడియో
జార్ఖండ్: ఒకవైపు బుల్లెట్ రైళ్లు,ఎలక్ట్రిక్ కార్లు అంటూ దేశం శరవేరంగా పరుగులుపెడుతున్న వైనం. మరోవైపు రైలు డ్రైవర్ వర్షంలో గొడుగు పట్టుకుని మరీ రైలు బండిని నడుపుత్ను షాకింగ్ సన్నివేశం. రైలు నడపడంలో కీలకమైన కంట్రోల్ ప్యానెల్ తడవకుండా గొడుగు పట్టుకుని, రైలును నడుపుతున్నఈ వీడియో ఒకటి ఇపుడు వైరల్‌గా మారింది. కొన్ని సంవత్సరాలుగా ఇదే దుర్భర పరిస్థితి కొనసాగుతోందంటూ ఈ వీడియోను రికార్డు చేసిన వ్యక్తి వాపోయారు. అంతేకాదు నేలమీద కూడా వర్షపు నీటిని రక్షించుకునేందుకు నేలమీద పరచిని న్యూస్ పేపర్లు.. ఇంకా మరిన్ని కష్టాలు ఈ వీడియోలు మనం చూడొచ్చు. కనీసం ఈ వీడియో చూసిన తరువాత అయినా పై అధికారుల్లో చలనం వస్తుందనీ, తద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆయన ఆశించారు. మరి ఫలితం ఉండబోతోందో.. వేచి చూడాల్సిందే.. మరోవైపు ఈ వీడియో ట్విట్టర్ లో దుమారం రేపుతోంది. పలు విమర్శలు, వ్యంగ్యాస్త్రాలతో కూడిన కమెంట్లు వెల్లువెత్తాయి. రైల్వే భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే కేంద్ర రైల్వేశాఖ మంత్రిత్వ శాఖ, మంత్రి సురేష్ ప్రభు ఈ అంశంపై సత్వరమే స్పందించాలని కోరారు Railway safety? @sureshpprabhu and @RailMinIndia need to take a serious look without victimising whistleblower pic.twitter.com/Ue7rv0LwTP — Sucheta Dalal (@suchetadalal) August 9, 2017 -
నడుపుతున్న రైల్లోనే ఆగిన డ్రైవర్ గుండె
నెల్లూరు(వేటపాలెం): నడుపుతున్న గూడ్సు రైల్లోనే ఆ డ్రైవర్ గుండె ఆగిపోయింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట నుంచి విజయవాడ వైపు (ద్వారపూడి) వెళుతున్న గూడ్సు డ్రైవర్ రైల్లోనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలొదిలాడు. ఇద్దరు డ్రైవర్లు రైల్లోనే టిఫిన్ తిన్నారు. పదినిమిషాల తరువాత గూడ్సు ప్రకాశం జిల్లా చిన్నగంజాం స్టేషన్ దగ్గర ఉండగా ఇంజిన్ క్యాబిన్లో ఉన్న ఒక డ్రైవర్ వి.సూర్యప్రకాశ్ (45)కు గుండెల్లో నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని పక్కనున్న డ్రైవర్ హరికి చెప్పి ఇంజిన్ క్యాబిన్‌లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే హరి వేటపాలెం స్టేషన్ మాస్టర్‌కు సమాచారం అందించారు. రైలు వేటపాలెం చేరుకోగానే సూర్యప్రకాశ్‌ను ప్లాట్‌ఫారంపైకి దించారు. 108 సిబ్బంది పరీక్షించి సూర్యప్రకాశ్ అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. -
గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో...
హైదరాబాద్: 'మాసాయిపేట' దుర్ఘటనపై నాందేడ్-కాచిగూడ ప్యాసింజర్ రైలు డ్రైవర్ స్పందించాడు. నిన్న ఉదయం 9:15 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని 'సాక్షి'తో చెప్పాడు. 300 మీటర్ల నుంచే తాము విజిల్ ఇచ్చామని తెలిపాడు. అయితే బస్సు ఆకస్మాత్తుగా ట్రాక్‌పైకి బస్సు వచ్చిందని, గార్డ్ రూము అడ్డుగా ఉండడంతో బస్సును గుర్తించలేకపోయామని వెల్లడించాడు. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించామని కాని రైలు వేగం వల్ల ప్రమాదం జరిగిందని ట్రైన్ డ్రైవర్ వివరించాడు. రైలు కనపడకుండా అడ్డుగా మారిన గది.. గేటు లేకుండా దిష్టిబొమ్మలా మిగిలిన ఆ గది ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ట్రాక్ దాటేందుకొచ్చే వాహనదారులు దగ్గరికొచ్చాక.. రైలు ఇంజిన్ సరిగ్గా ఎంతదూరంలో ఉందో కనిపించకుండా ఆ గది అడ్డుగా మారింది. ఇంజిన్ కాస్త దూరంగానే ఉండిఉంటుందన్న భావనతో కొందరు వాహనదారులు వేగంగా వాహనాన్ని పట్టాలెక్కించి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆ గది కట్టకముందు అడపాదడపా జరిగే ప్రమాదాలు.. ఆ తర్వాత తరచూ జరుగుతున్నాయి. గది నిర్మాణం తర్వాత దాదాపు 25కుపైగా ప్రమాదాలు జరిగాయన్నది స్థానికుల కథనం. అందులో ఈ స్కూలు బస్సు దుర్ఘటన అతిపెద్దది. ఒకవేళ గేటు ఏర్పాటు చేయటంలో మరింత జాప్యం జరిగేపక్షంలో వెంటనే ఆ గదిని కూల్చేయాలని వారు అధికారులను కోరుతుండటం గమనార్హం. -
తప్పిన పెను ప్రమాదం
సాక్షి, చెన్నై: వ్యాసార్పాడి-బీచ్ స్టేషన్ మార్గంలో పట్టాలు పలు చోట్ల ధ్వంసమైన విషయూన్ని ఈఎంయూ రైలు డ్రైవర్ సకాలంలో గుర్తించారు. పరుగులు తీస్తున్న రైలు అర్ధాంతరంగా ఆగడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాలు తరచూ పగుళ్లకు గురవుతున్నాయి. ఈ పగుళ్లతో కొన్ని సందర్భాల్లో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి. దీంతో రైలు సేవలకు ఆటంకం కలుగుతోంది. ఆదివారం ఏకంగా పది చోట్ల పట్టాలు దెబ్బతినడం ప్రయూణికులను మరింత ఆందోళనలో పడేసింది. ఆదివారం సాయంత్రం తిరుత్తణి - బీచ్ మార్గంలో ఓ గూడ్స్ రైలు వెళ్లింది. ఆ రైలు వెళ్లిన కాసేపటికి బీచ్ నుంచి తిరువళ్లూరు, అరక్కోణం మీదుగా తిరుత్తణికి ఈఎంయూ రైలు బయలు దేరింది. వ్యాసార్పాడి -బీచ్ మార్గంలోని కొరుక్కు పేట సమీపంలో వేగంగా పరుగులు తీస్తున్న రైలు హఠాత్తుగా ఆగింది. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. ఏదో ప్రమాదం జరిగిందన్న ఆందోళనతో రైలు ఆగగానే కొన్ని బోగీల్లోని ప్రయాణికులు కిందకు దిగేశారు. అయితే, కొన్ని బోగీలు వంతెన మీద ఉండటంతో అందులోని ప్రయాణికులు కిందకు దిగ లేని పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఆ బోగీల్లో ఉన్న ప్రయాణికులను జాగ్రత్తగా కిందకు దించారు. గూడ్స్ రైలు చక్రాల్లో తలెత్తిన లోపమో ఏమోగానీ పది చోట్ల రైల్వే ట్రాక్ దెబ్బ తిని ఉండడాన్ని ఈఎంయూ డ్రైవర్ గుర్తించారు. అక్కడక్కడ రాచుకుపోయినట్టుగా ట్రాక్ దెబ్బ తిని ఉండటం వల్లే ఈఎంయూను హఠాత్తుగా నిలిపేశారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పింది. అయితే, ఆ మార్గంలో ఈఎంయూ సేవలు ఆగాయి. ఆగమేఘాలపై రైల్వే సిబ్బంది మరమ్మతుల్లో నిమగ్నం అయ్యారు.