ప్రతికాత్మక చిత్రం
తాడేపల్లి రూరల్: విధుల్లో ఉన్న డ్రైవర్‌కు గుండెపోటు రావడం, అదే సమయంలో సిగ్నల్ పడడం, సకాలంలో సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పడమే కాకుండా డ్రైవర్ ప్రాణాలు సైతం నిలిచాయి. శుక్రవారం కృష్ణాకెనాల్ జంక్షన్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న గూడ్స్ రైలు కృష్ణా కెనాల్ జంక్షన్‌లో 5వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీద సిగ్నల్ కోసం వేచి ఉంది. ఆ రైలు నడుపుతున్న డ్రైవర్ జె.హరికుమార్‌కు గుండెనొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు.
మరో డ్రైవర్ గూడ్స్‌రైలు కిందకు దిగి చెక్ చేసుకుంటూ ఆ విషయాన్ని గమనించలేదు. అయితే అక్కడే డ్యూటీలో ఉన్న ఆర్‌పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ డి.రాజు ఈ విషయాన్ని గమనించి వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా డ్రైవర్‌ను రైలులో నుంచి దించి రెస్ట్‌రూమ్‌కు తీసుకెళ్లారు. 108 రాకపోవడంతో ఆటోలో వెంటనే అతడిని తాడేపల్లిలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌కు తరలించారు. అతడికి గుండెపోటు వచ్చిందని, మరో 30 నిమిషాలు ఆలస్యమైతే అతని ప్రాణానికే ముప్పు వాటిల్లేదని వైద్యులు తెలిపారు. ప్రమాదం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి:
గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే..
వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..
Comments
Please login to add a commentAdd a comment