రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే.. | Motorman In Maharashtra Stops Train Midway To Urinate On Track | Sakshi
Sakshi News home page

రైలును ఆపి ఇంజన్‌ ఎదుటే..

Published Thu, Jul 18 2019 8:54 PM | Last Updated on Thu, Jul 18 2019 8:56 PM

Motorman In Maharashtra Stops Train Midway To Urinate On Track - Sakshi

ముంబై : రైలు డ్రైవర్‌ ఉన్నపళంగా రైలును ఆపివేసి ఇంజన్‌ ముందు మూత్రం పోసిన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మహారాష్ట్రలోని ఉల్లాస్‌నగర్‌-విఠల్‌వాడి రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ముంబై వెళుతున్న ఈ రైలును డ్రైవర్‌ అర్థంతరంగా ఆపి ఇంజన్‌ ముందే మూత్రవిసర్జన చేయడాన్ని వీడియో తీసిన కొందరు దీన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

రైళ్లలోని డ్రైవర్లు, గార్డుల క్యాబిన్స్‌లో టాయ్‌లెట్స్‌ను ఏర్పాటు చేయాలని ఈ వీడియోను చూసిన పలువురు నెటిజన్లు డిమాండ్‌ చేశారు. ఇలా చేయడం డ్రైవర్‌ తప్పు కాదని లోకోమోటివ్‌, ఇంజన్‌ సిబ్బంది కోసం టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేయని భారత రైల్వేలదే తప్పని ఓ ట్విటర్‌ యూజర్‌ పేర్కొనగా, డ్రైవర్లు, గార్డుల క్యాబిన్‌లో టాయ్‌లెట్స్‌ ఏర్పాటు చేయాలని మరో ట్విటర్‌ యూజర్‌ కోరారు.​

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement