ఇంగ్లిష్‌ యాదవ్‌ చాచా | Maharashtra auto driver speaks fluent English | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ యాదవ్‌ చాచా

Published Sun, Jul 14 2024 6:25 AM | Last Updated on Sun, Jul 14 2024 6:25 AM

Maharashtra auto driver speaks fluent English

వైరల్‌ 

ఆంగ్లంలో మాట్లాడితే ఆశ్చర్యపోయి, అబ్బురపడే రోజులు కావు ఇవి.. ఇంగ్లిష్‌లో మాట్లాడడం ఈరోజుల్లో చాలా సహజం. అయితే ఒక ఆటో డ్రైవర్‌ ఇంగ్లిష్‌లో మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది. మూడు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతిలో యాదవ్‌ చాచా అనే ఆటో డ్రైవర్‌ ఉన్నాడు. 

ఇతడిని ‘ఆటోడ్రైవర్‌ యాదవ్‌ చాచా’ అని పిలిచే వారు చాలా తక్కువ. ‘ఇంగ్లిష్‌ యాదవ్‌ చాచా’ అనే పిలిచేవారే ఎక్కువ. దీనికి కారణం యాదవ్‌ ఇంగ్లిష్‌ బాగా మాట్లాడుతాడు. తాజా వైరల్‌ వీడియోలో భూషణ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ యాదవ్‌తో ఇంగ్లిష్‌లో మాట్లాడించాడు. ‘ఇంగ్లిష్‌ తెలిస్తే ఇంగ్లాండ్, అమెరికాలాంటి ఎన్నో దేశాలకు వెళ్లవచ్చు. ఇంగ్లిష్‌ నేర్చుకోండి. ఇది అంతర్జాతీయ భాష’ అంటూ మాట్లాడాడు యాదవ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement