తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
రాజమండ్రి: కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిపై గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కాకినాడ నుంచి ఔరంగాబాద్కు గూడ్స్ వెళ్తుండగా రాజమండ్రి -కోవూరు మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజమండ్రి మీదుగా వెళ్లే రైళ్లను దారి మళ్లించారు.