గూడ్స్‌ బోగీలో రక్తపు సంచి  తీరా చూస్తే..   | Blood Bag In Goods Train | Sakshi
Sakshi News home page

గూడ్స్‌ బోగీలో రక్తపు సంచి.. చూస్తే  చనిపోయిన కుక్క

May 28 2018 2:11 PM | Updated on Sep 29 2018 4:26 PM

Blood Bag In Goods Train - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

రైల్వేగేట్‌: ఓ గూడ్స్‌ రైలులోని ఖాళీ  బోగీలో రక్తం కారుతున్న కట్టు కట్టి ఉన్న ఓ సంచి సిబ్బందికి కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీరా దానిని తెరచి చూస్తే చనిపోయిన కుక్క కనిపించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సంఘనటన ఆదివారం మధ్యాహ్నం వరంగల్‌ గూడ్స్‌ షెడ్‌లోని రైలు బోగీలో జరిగింది. వరంగల్‌ జీఆర్‌పీ ఏఎస్సై పరశురాములు కథనం ప్రకారం.. పీడీఎస్‌ బియ్యం లోడ్‌ చేసుకుని తీసుకెళ్లేందుకు గద్వాల నుంచి హైదరబాద్‌ కాచిగూడ, అక్కడి నుంచి వరంగల్‌కు వచ్చిన గూడ్స్‌రైలులోని ఓ ఖాళీ బోగీలో సంచి కనిపించింది.

అది కూడా రక్తం కారుతుండడంతో అనుమానం వచ్చిన గూడ్స్‌ షెడ్‌ సిబ్బంది స్టేషన్‌ డిప్యూటీ మేనేజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను జీఆర్‌పీ పోలీసులకు చెప్పారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సంచిని బయటకు తీయించి విప్పగా అందులో చనిపోయి ఉన్న కుక్క కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు..  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement