మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘజియాబాద్‌కు వెళ్లాల్సిన గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘజియాబాద్‌కు వెళ్లాల్సిన గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో నిలిచిపోవటంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. జడ్చర్ల రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.10 గంటలకు ఘజియాబాద్ వైపు బయలుదేరిన గూడ్స్‌రైలు గొల్లపల్లి స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. దీంతో సికింద్రాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ జడ్చర్ల రైల్వేస్టేషన్‌లో, గుంటూరుకు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలు గొల్లపల్లి స్టేషన్‌లో నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్ నుంచి మరో లైట్ ఇంజన్‌ను తెప్పించి గూడ్స్ రైలు క్లియర్ చేయటంతో రాకపోకలు యథావిధిగా సాగాయి.
తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలును జడ్చర్ల స్టేషన్‌లో గంటన్నరపాటు నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురై స్టేషన్ మాస్టర్‌తో వాగ్వాదానికి దిగారు. చివరికి 7.30 గంటలకు తుంగభద్ర బయలుదేరింది. ఈ క్రమంలో గుంటూరు ప్యాసింజర్ గంటన్నర, చెన్నై ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్‌లు గంటకుపైగా ఆలస్యంగా నడిచాయి.