
ఘజియాబాద్ : ఆగ్రా - ఢిల్లీ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైలుకు చెందిన నాలుగు బోగీలు పట్టాల పక్కకి ఒరిగిపోయాయి. ఘజియాబాద్ వల్లభ్‌గఢ్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిది. ఢిల్లీ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఛటికర గ్రామం ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో పిల్లర్ నంబర్ 1408 వద్ద నాలుగు బోగీలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. లైన్లు మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment