ఒడిశా: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 బోగీలు బోల్తా పడ్డాయి. 207 మంది మృతి చెందారు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 900 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి హౌరా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
మరో ట్రాక్ మీద పడి ఉన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీకొని యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. సారో, గోపాల్‌పూర్, ఖంటపాడ పీహెచ్‌సిలకు బాధితులను తరలిస్తున్నారు. సహాయక సిబ్బంది బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. మృతుల కుటుంబాలకు రైల్వే మంత్రి రూ. 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు.
రైలు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనాస్థలిలో 50 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని బాలాసోర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
హెల్ప్‌లైన్ నంబర్లు: 044-2535 4771, 67822 62286
Terrible Train accident in odisha India, with multiple dead bodies can be seen #TrainAccident #CoromandelExpress #Odisha pic.twitter.com/NsJ04P3hlT
— Rizwan 💙 (@Rizwan88826075) June 2, 2023
Coromandel Express derails near Bahanaga station in Odisha's Balasore after collision with a goods train
— Nazaket Rather (@RatherNazaket) June 2, 2023
Rescue operations continue @RailMinIndia #TrainAccident pic.twitter.com/9w24Qvpt9f
Comments
Please login to add a commentAdd a comment