3 killed as goods train derailment, hits passengers waiting hall in Odisha - Sakshi
Sakshi News home page

షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి..

Published Mon, Nov 21 2022 10:18 AM | Last Updated on Mon, Nov 21 2022 11:44 AM

Odisha Jajpur Rail Accident Goods Train Crashes Into Platform - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశాలో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. జాజ్‌పూర్ జిల్లా కొరాయి రైల్వే స్టేషన్‌లో గూడ్సు రైలు పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. పలువురు రైలు కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రమాదంలో రైల్వే స్టేషన్ కూడా పాక్షికంగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ప్యాసెంజర్ల వెయిటింగ్ హాల్‌లోకి గూడ్స్ రైలు దూసుకెళ్లినట్లు సమాచారం. రైలు పట్టాలు తప్పడంతో స్టేషన్‌లోని రెండు ట్రాక్‌లు బ్లాక్ అయి రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో మొత్తం 12 బోగీలు పట్టాలు తప్పాయి. నాలుగు భోగీలు బోల్తాపడ్డాయి. రైల్వే స్టషన్‌లో ఫుటోవర్ బ్రిడ్జి కూడా ధ్వైంసమైంది. అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి రైల్వే స్టేషనలో సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.


రూ.5లక్షల పరిహారం..
ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారంగా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయంగా అందిస్తామన్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ కూడా ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement