పక్కకు ఒరిగి ఉన్న రైలు బోగీ
శ్రీకాకుళం, కాశీబుగ్గ: పలాస రైల్వేష్టేషన్ పరిధిలో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో ఒక్కసారిగా అధికారులు పరుగులు పెట్టారు. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వైపు సిమెంట్ లోడుతో వెళ్తున్న గూడ్స్‌రైలు సాంకేతిక లోపంతో పలాస వద్ద కొంచెం వెనక్కి వచ్చింది. దీనిని గమనించి, సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే పట్టా తప్పి, విరిగిపోయింది. ఘటనలో మూడు బోగీలు పట్టాల నుంచి పక్కకు ఒరిగాయి. అయితే ప్రాణ, ఆస్తినష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
తిరిగి ట్రాక్‌పైకి బోగీలను తీసుకొచ్చే పనుల్లో రైల్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. రైల్వే ఇంజినీరింగ్ సిబ్బంది పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. పలాస రైల్వే ష్టేషన్ పరిధిలో ఎటా ఎక్కడో ఒకచోట గూడ్సు రైలు పట్టాలు తప్పుతునే ఉన్నాయని, అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.ఇదిలా ఉండగా... పలాస రైల్వేష్టేషన్ పరిధిలో పట్టాలు తప్పిన గూడ్సురైలు ఉదయం నుంచి పనరుద్ధరణ పనులు నిర్వహించగా సాయంత్రానికి రెండు బోగీలు, రాత్రి 7 గంటలకు మరో పెట్టెను పట్టాలెక్కించి పనులు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పలాస రైల్వేష్టేషన్ మీదుగా రాకపోకలు సాగించాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి.
Comments
Please login to add a commentAdd a comment