రైలు కింద పడిన వృద్ధుడికి తీవ్రగాయాలు | man falls from train injured | Sakshi
Sakshi News home page

రైలు కింద పడిన వృద్ధుడికి తీవ్రగాయాలు

Published Thu, Oct 29 2015 10:55 AM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీపై నుంచి వెళ్లబోతూ ఓ వృద్ధుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బెనలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆదిలాబాద్: ఆగి ఉన్న గూడ్స్ రైలు బోగీపై నుంచి వెళ్లబోతూ ఓ వృద్ధుడు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బెనలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

నంబాల గ్రామానికి చెందిన పోషం(60) స్థానికంగా జాలరి వృత్తిని కొనసాగిస్తున్నాడు. అతడు గురువారం చేపలను విక్రయించి తిరుగు పయనమయ్యాడు. అయితే, స్థానిక రైల్వేస్టేషన్ గేట్ వద్ద గూడ్సు రైలు ఆగి ఉంది. రైలు పట్టాలు దాటే క్రమంలో రైలు బోగీపైకి ఎక్కిన సమయంలోనే గూడ్సు కదిలింది. దీంతో అదుపుతప్పి పోషం రైలు కింద పడిపోయాడు. అతడి కాళ్లు, చేతులు తెగిపోయాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement