Train engine
-
Video: వందే భారత్ రైలులో సాంకేతిక లోపం.. లాక్కెళ్లిన మరో ఇంజిన్
లక్నో: భారత రైల్వే తీసుకొచ్చిన సెమీ స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. అంతే స్పీడ్‌తో పలు రూట్లలో పరుగులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెచ్చిన ఈ రైళ్లపై అంతే విమర్శలు కూడా వినిపిస్తుంటాయి . గతంలో ఎన్నోసార్లు రైళ్లపై రాళ్లు రువ్వడం, గేదేలు వంటివి ఢీకొని రైళ్లు ధ్వంసమైన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి.తాజాగా ఓక వందే భారత్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగిన ఆ రైలు అక్కడి నుంచి ముందుకు కదలలేదు. చివరకు మరో రైలు ఇంజిన్ ద్వారా వందే భారత్ రైలును సమీపంలోని స్టేషన్ వరకు లాక్కెళ్లారు. ఈ ఘటన న్యూఢిల్లీ- వారణాసి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది. రైలు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో సోమవారం ఉదయం 9.15 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో అది ఆగిపోయింది. సమాచారం రైల్వే టెక్నికల్ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని వందే భారత్ రైలు ఇంజిన్‌లోని సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చివరకు మూడు గంటల తర్వాత మరో రైలు ఇంజిన్‌ను రప్పించారు. దాని ద్వారా వందే భారత్ రైలును భర్తానా రైల్వే స్టేషన్ వరకు లాక్కెళ్లారు.What a sight.The old engine comes to rescue the famed Vande Bharat which ran into technical glitch and got stranded in Etawah, UP. Happened to the Varanasi bound Vande Bharat adversely affecting operations of other trains on the route. pic.twitter.com/rvOwbkDz4K— Piyush Rai (@Benarasiyaa) September 9, 2024మరోవైపు ఈ సంఘటన వల్ల వందే భారత్ ట్రైన్‌లోని ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కంపార్ట్‌మెంట్స్‌లోని ఏసీలు పని చేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోయారు. చివరకు వందే భారత్ ట్రైన్‌లోని సుమారు 750 మంది ప్రయాణికులను ఇతర రైళ్లలో వారి గమ్యస్థానాలకు చేర్చారు. కాగా, వందే భారత్ ట్రైన్‌ను మరో రైలు ఇంజిన్ ద్వారా లాక్కెళ్లిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో రైల్వేతోపాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. -
బోగీలను వదిలి వెళ్లిపోయిన గూడ్స్ రైలు ఇంజన్
పిడుగురాళ్ల: గూడ్స్ రైలు ఇంజన్ బోగీలను వదిలి వెళ్లిన ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం జరిగింది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వైపు వెళ్తోన్న గూడ్స్ రైలు పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ సమీపంలోని 65వ గేటు వద్ద బోగీలను వదిలి ఇంజన్ వెళ్లిపోయింది. ఇది గమనించిన గూడ్స్ రైలు గార్డ్ రైల్వే అధికారులకు, గూడ్స్ రైలు డ్రైవర్‌కు సమాచారమిచ్చారు. జానపాడు రైల్వే గేటు దాటి వెళ్లిన ఇంజన్‌ను రైల్వే గూడ్స్ డ్రైవర్ బోగీలు ఆగిన ప్రదేశానికి తీసుకొని వచ్చాడు. రైల్వే అధికారులు, సిబ్బంది గూడ్స్ బండి ఇంజన్, బోగీలను కలిపించారు. ఇదంతా 15 నిమిషాల సమయం పట్టింది. ఆ సమయంలో పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ వైపు వచ్చే రైళ్లు ఏమీ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని, లేదంటే పెద్ద ప్రమాదమే జరిగేదని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
... అదృష్టం.. బోగీలెత్తుకెళ్లలేదు కాబట్టి తిరిగొచ్చా... సంతోషించు!
... అదృష్టం.. బోగీలెత్తుకెళ్లలేదు కాబట్టి తిరిగొచ్చా... సంతోషించు! -
Secunderabad Railway Station: రైల్వేకు నష్టం రూ.12 కోట్లు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్‌ఫామ్‌లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. -
రైలు ఇంజిన్, బోగీల మధ్య తెగిన లింక్
వెల్దుర్తి: కర్ణాటకలోని మంగుళూరు సెంట్రల్ నుంచి తెలంగాణలోని కాచిగూడకు ప్రయాణిస్తున్న (ట్రైన్ నంబర్ 02778–కాచిగూడ స్పెషల్) ఎక్స్‌ప్రెస్ రైలుకి ఇంజిన్, బోగీల మధ్య లింక్ తెగిపోయింది. దీంతో రైలు కర్నూలు జిల్లా వెల్దుర్తి రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఆగిపోయింది. గార్డు, లోకో పైలెట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. ఈ నెల1న శనివారం రాత్రి 8 గంటలకు మంగుళూరు నుంచి కాచిగూడకు రైలు బయలుదేరింది. తమిళనాడు, ఏపీల మీదుగా ప్రయాణిస్తూ 2 వ తేదీన సాయంత్రం 6 గంటలకు వెల్దుర్తి రైల్వేస్టేషన్‌ను దాటింది. దాటిన క్షణమే ఇంజిన్‌కు, వెనుక ఉండే 19 బోగీల లింక్ తెగిపోయింది. దీన్ని వెనుక బోగీలోని గార్డు గుర్తించి అప్రమత్తమై లోకో పైలెట్‌కు సమాచారమివ్వగా అతడు బోగీలకు ఉండే సేఫ్టీ బ్రేక్ వేశాడు. దీంతో బోగీలు ఆగిపోయాయి. అదే సమయంలో అర కిలోమీటరు ముందుకు వెళ్లిన ఇంజిన్‌ను లోకో పైలెట్ ఆపేశాడు. వెంటనే పైలెట్, గార్డు, సిబ్బంది ఇంజిన్‌ను వెనుకకు తెచ్చి బోగీలకు లింక్ చేశారు. ఇదేమీ తెలియని 17 బోగీలలోని 1,500కు మించి ప్రయాణికులు ఆందోళన చెందారు. చివరకు ప్రమాదం తప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు. గంట పాటు ఆలస్యమైన రైలు పూర్తి లింక్ మరమ్మతుల అనంతరం సాయంత్రం 7.05 గంటలకు బయలుదేరింది.కాగా, ఘటనా ప్రాంతంలో పెద్ద మలుపు, దాటగానే వంతెన ఉంది. రైలు వేగంగా వెళ్లి ఉంటే బోగీలు పల్టీకొట్టి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. -
Photo Story: చెట్లన్నీ పచ్చని తివాచీలా!
చుట్టూ పచ్చని చెట్లు.. దట్టమైన అడవులు.. పుడమి తల్లికి ఆకు పచ్చని చీర చుట్టినట్లే ఉంది కదూ..! అడవి మధ్య నుంచి తాచుపాము మెలికలు తిరుగుతూ వెళ్తున్నట్లు ఉన్న ఈ తారు రోడ్డు ఆదిలాబాద్ జిల్లా నుంచి నాగ్‌పూర్ వెళ్లే 44వ నంబర్ రహదారి. ఇటీవల కురిసిన వర్షాలకు చెట్లన్నీ ఇలా పచ్చని తివాచీలా పరుచుకుని చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఇల్లెక్కిన రైలింజన్ మంచిర్యాల: రైలు ఇంజన్ ఇంటిపైకి ఎలా చేరిందా అని డౌటా? మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీలో ఓ ఇంటి యజమాని రైలు ఇంజన్ ఆకారంలో నీళ్ల ట్యాంకు నిర్మించి దానికి అచ్చం రైలు ఇంజన్లాగే రంగులు వేయించి అలంకరించారు. ఇది చూసిన వారు అచ్చం రైలు ఇంజన్ ఇంటిపైకి ఎక్కించారా అని ఆశ్చర్యపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, మంచిర్యాల వరదొచ్చె.. ఇసుక రవాణా నిలిచె స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని మూసీ పరవళ్లు తొక్కుతోంది. దీంతో జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, ఇటుకులపహాడ్ వద్ద ఉన్న ఏడు క్వారీలు బంద్ అయ్యాయి. దీంతో ఇసుక కోసం వచ్చిన లారీలు ఇలా బారులుదీరాయి. జాజిరెడ్డిగూడెం హైవే బైపాస్ నుంచి శాలిగౌరారం మండలం వంగమర్తి వరకు జాతీయ రహదారిపై 200 లారీలు నిలిచిపోయాయి. వంగమర్తి క్వారీ వద్ద కూడా లారీలు క్యూకట్టాయి. – అర్వపల్లి, నల్లగొండ ఊరు బాగుండాలని.. ఊరంతా పచ్చగా ఉండాలని, పశుసంపద వృద్ధి చెందాలని వేడుకుంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గిరిజన తండాల్లో మంగళవారం శీత్లాభవాని వేడుకలు నిర్వహించారు. తండా పొలిమేరలో ప్రతిష్టించిన ఏడు విగ్రహాలను అలంకరించి మొక్కులు చెల్లించుకున్నారు. తండాల్లోని 900 పశువులను గుట్టపైకి తీసుకొచ్చి దేవతా విగ్రహాల ముందు నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లారు. –రుద్రంగి, రాజన్న సిరిసిల్ల మొక్క.. నాటాలి పక్కా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతిలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇంటి ముందు పచ్చదనం వెల్లివిరిసేలా ఈ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచిస్తున్నారు. పట్టణ ప్రగతి మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఆదిలాబాద్ పట్టణంలో 3 లక్షల మొక్కలు పంపిణీ చేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. గులాబీ, చామంతి, ఎర్రమందారం, మల్లెపువ్వు, బంతి తదితర రకాల పూల మొక్కలను మున్సిపల్ వాహనంలో ఇంటింటికీ తీసుకెళ్తూ అందచేస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలో కనిపించిన దృశ్యమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
మనిషి తలతో వచ్చిన రైలు ఇంజిన్
చెన్నై,తిరువొత్తియూరు: ఈరోడ్‌లో ఓ రైలు ఇంజిన్ మనిషి తలతో వచ్చింది. వివరాలు..మైసూర్ నుంచి మైలాడుదురై వెళ్లే రైలు ఇంజన్ ఈరోడ్ నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. ఇందుకోసం రైలు ఇంజిన్ ఈరోడ్ డీజిల్ లోకో షెడ్‌కు వెళ్లింది. ఆ సమయంలో రైలు ఇంజిన్ ముందు భాగంలో మనిషి తల చిక్కుకొని వేలాడుతూ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న ఈరోడ్ రైల్వేస్టేషన్ సహాయ మేనేజర్ కలుశేఖరన్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. తరువాత మనిషి తలను బయటకు తీసి ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో తల ఖండించబడి ఇంజిన్‌కు చిక్కుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రైలు ఇంజిన్ వచ్చే మార్గంలో అన్ని రైల్వేస్టేషన్లకు దీని గురించి సమాచారం అందించారు. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
పట్టాలు తప్పిన రైలింజన్
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖ రైల్వే స్టేషన్ ఔటర్లో ఖాళీ రైలు ఇంజిన్ పట్టాలు తప్పడంతో విశాఖ నుంచి బయల్దేరాల్సిన, విశాఖకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రద్దు కాగా, మరికొన్ని గమ్యం కుదించారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్(ఖాళీ రేకు)ను శనివారం యార్డు నుంచి ప్లాట్‌ఫాం మీదకు తీసుకువస్తున్న సమయంలో ఇంజిన్ పట్టాలు తప్పింది. అప్పటి నుంచి ఒకే ట్రాక్‌పై రైళ్లు నడిచాయి. దీంతో విశాఖపట్నం నుంచి పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తిరుపతి నుంచి విశాఖ రావాల్సిన డబుల్ డెక్కర్, ఎల్టీటీ, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను దువ్వాడలోనే నిలిపివేశారు. విజయవాడ నుంచి విశాఖపట్నం రావాల్సిన రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను దువ్వాడలోనే నిలిపివేసి.. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. డిఘా –విశాఖపట్నం(22873)ఎక్స్‌ప్రెస్‌ను సింహాచలం నార్త్‌లో నిలిపివేశారు. కోరాఫుట్– విశాఖపట్నం(18511)ఎక్స్‌ప్రెస్‌ను పెందుర్తిలో నిలిపివేసి అక్కడ నుంచి విశాఖపట్నం–భువనేశ్వర్ (22820) ఇంటర్‌సిటీగా పంపించారు. అలాగే దుర్గ్–విశాఖపట్నం(58529) పాసింజర్‌ను సింహాచలం నార్త్‌లో, రాయగడ–విశాఖపట్నం(58503)పాసింజర్‌ను కొత్తవలసలో, పలాస–విశాఖపట్నం(58531)పాసింజర్‌ను అలమండలో నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు. రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు టికెట్ చార్జీలను వాపస్ ఇస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. గంటల తరబడి నిరీక్షణ మెయిల్‌కు కుటుంబ సభ్యులతో కలసి చెన్నై వెళ్లాలి. రైలు దాదాపు నాలుగు గంటల ఆలస్యంగా వస్తుందని ప్రకటించారు. రైలు ఎప్పుడొస్తుందో తెలియక.. స్టేషన్లోనే గంటల తరబడి వేచి ఉన్నాం. – దేముడు, విశాఖపట్నం నరకంగా ప్రయాణం మాది అనంతపురం. విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాం. ఈ ప్రయాణం నరకం అనిపించింది. ఎక్కడపడితే అక్కడ గంటల కొద్దీ రైలును ఆపేశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డాం. – అర్చన, అనంతపురం రాయగడ వెళ్లాలి ఏలూరు నుంచి రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చాం. రాయగడ గుడికి వెళ్తున్నాం. కానీ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దువ్వాడలో నిలిపి వేయడంతో అక్కడే సాయంత్రం వరకు వేచి ఉండి.. ఇప్పుడు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకున్నాం. కోర్బాలో రాయగడ వెళ్లాలనుకుంటున్నాం. అదీ కూడా సమయం మారిందని చెప్పారు. పిల్లా పాపలు, పెద్దలతో చాలా అవస్థలు పడ్డాం. – గౌరీ, ఏలూరు పరామర్శకు వెళ్లాలని వస్తే.. పార్వతీపురం నుంచి వస్తున్నాం. మా బంధువుకు ప్రమాదం జరిగింది. తొందరగా మచి లీపట్నం వెళ్లాలి. ఇక్కడకు వచ్చి చూస్తే.. మచిలీపట్నం రైలు రద్దు చేసినట్టు చెబుతున్నారు. ఎల్టీటీలోనైనా వెళ్తాం. – డి.పద్మ, పార్వతీపురం -
రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్!
సాక్షి, చెన్నై: కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. కడలూర్, ధర్మపురి, మెట్టూరు, విల్లుపురం ప్రాంతాల్లోనైతే ఆందోళనలు హోరెత్తాయి. బోర్డు ఏర్పాటుచేయమని సుప్రీంకోర్టు చెప్పినా వినిపించుకోకుండా మోదీ సర్కార్ ఒంటెత్తుపోకడ పోతున్నదని తమిళపార్టీలు ఆరోపించాయి. కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ రైల్‌రోకోకు పిలుపివ్వగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్దతు తెలిపింది. ఈ రెండు పార్టీలకుతోడు వందలాది సంఘాలు, వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నారు. ఊహించని షాక్: రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, ఊహించని కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి. విల్లుపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయింది. షాక్‌కు గురైన వ్యక్తి పేరు రంజిత్(32)గా గుర్తించారు. హైవోల్టేజ్ ధాటికి అతను మాడి మసైపోయాడని తొలుత వార్తలు వచ్చినా, అది నిజం కాదని వైద్యులు పేర్కొన్నారు. ‘‘హైటెన్షన్ వైర్లను అతను ముట్టుకోలేదు. కానీ అత్యంత సమీపానికి వెళ్లడంతో ఒక్కసారే షాక్ కొట్టి, మంటలు చెలరేగాయి. ఒక మోస్తారుకు మించి బాధితుడు గాయపడ్డాడని, ప్రాణాపాయం లేనప్పటికీ, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. -
తమిళనాడు రైల్‌రోకో ఆందోళనలో ఊహించని ఘటన
-
రైలింజిన్ దగ్ధం
బొబ్బిలి: విశాఖ నుంచి ఒడిశాలోని లడ్డ వెళ్తున్న రైలు ఇంజిన్‌లో మంటలు రేగడంతో బొబ్బిలి ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రాయిని తరలిస్తున్న ఈ బీటీ(బాలిష్ ట్రైన్)కి సంబంధించిన ఇంజిన్లోనుంచి మంటలు రేగి కాలిపోతుండటం చూసిన స్థానికులు భయాందోళన చెందారు. సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒడిశాలోని లడ్డ వెళ్తున్న ఈ ట్రైన్ విజయనగరం జిల్లా బొబ్బిలి, డొంకినవలస రైల్వే స్టేషన్ల మధ్యకు వచ్చే సరికి ఇంజిన్‌లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. వెంటనే విజయనగరం, విశాఖల్లోని రైల్వే ఉన్నతాధికారులకు సమాచారమందించారు. అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అనంతరం ఇంజిన్‌ను బొబ్బిలి జంక్షన్‌కు తరలించారు. రైల్వే ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లనే మంటలు చెలరేగాయనీ రైల్వేవర్గాలు తెలిపాయి. ఈ సంఘటనలో ఇంజిన్‌కు చెందిన ముఖ్యమైన విద్యుత్‌వైర్లు కాలిపోయాయని తెలిపారు. మళ్లీ మరమ్మతులు చేసిన వెంటనే ఇంజిన్ సర్వీసులోకి వచ్చేస్తుందనీ, దీనికి లక్షల్లోనే ఖర్చవుతుందనీ ఆ వర్గాలు చెప్పాయి. నాగావళి ఎక్స్‌ప్రెస్ నిలిపివేత బీటీ ఇంజిన్‌లోంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, దట్టంగా పొగ అలముకోవడంతో ఈ ప్రాంతమంతా భయానకంగా కనిపించింది. ఈ సమయంలో అటుగా వస్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌ను కొద్ది సేపు నిలిపివేసినట్టు స్థానికులు తెలిపారు. మొత్తం మీద పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. -
కోకనాడ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్లో మంటలు
కైకలూరు స్టేషన్లో ఘటన.. తప్పిన భారీ ప్రమాదం కైకలూరు: కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే కోకనాడ ఎక్ప్రెస్ (ట్రెయిన్ నంబరు 12775) రైలు ఇంజన్ కృష్ణాజిల్లా కైకలూరు రైల్వేస్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి మంటల్లో చిక్కుకుంది. కాకినాడ నుంచి బయలుదేరి రాత్రి 11.16 గంటలకు కైకలూరుకు రావాల్సిన రైలు ఆలస్యంగా 11.50 గంటలకు చేరుకుంది. స్టేషన్లో ఆగిన కొంతసేపటికే రైలు ఇంజన్ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై బోగీల నుంచి ఇంజన్‌ను వేరు చేశారు. అప్పటికే ఇంజన్ నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న కైకలూరు ఫైర్‌స్టేషన్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. వేరే ఇంజన్ ఏర్పాటు చేసి రాత్రి 1:40 సమయంలో రైలు సికింద్రాబాద్‌కు పంపారు. -
పట్టాలు తప్పిన రైలింజన్
గుత్తి (గుంతకల్లు) : షంటింగ్ చేస్తున్న రైలింజిన్ ప్రమాదవశాత్తు పట్టాలు తప్పిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రైలింజిన్ (నంబర్ డబ్ల్యూడీజీ 3ఏ 13100) రాత్రి 8.30 గంటల సమయంలో బే–1 వద్ద నుంచి వాషింగ్ పాయింట్ వద్దకు బయలు దేరింది. అయితే.. డీజిల్ షెడ్లోని వాషింగ్ పాయింట్ వద్ద పట్టాలు తప్పింది. ఎలాంటి ఆస్తి నష్టమూ సంభవించలేదు. సమాచారం తెలుసుకున్న రైల్వే ఉన్నతాధికారులు టెక్నీషియన్లను, మెకానిక్‌లను పంపి ఇంజిన్‌ను తిరిగి యథాస్థితికి తెచ్చారు. ఇదే ప్రాంతంలో గతంలో ఐదారు సార్లు షంటింగ్ ఇంజిన్లు పట్టాలు తప్పాయి. -
సాంకేతిక లోపంతో నిలిచిపోయిన రైలింజన్
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం రాత్రి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై రైలింజన్ నిలిచిపోయింది. దీని కారణంగా తణుకులో విశాఖ ఎక్స్‌ప్రెస్, అత్తిలిలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. నిడదవోలు, తణుకు మీదుగా విజయవాడ వెళ్లాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే శాఖ వెల్లడించింది. దాంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
ఇంజన్లో పొగలు..ఆగిన రైలు
చిత్తూరు: ఇంజన్లో తలెత్తిన సమస్యకారణంగా పొగలు రావడంతో శేషాద్రి ఎక్స్ ప్రెస్‌ని కుప్పంలో నిలిపేశారు. తొలుత కుప్పం మండలం ఆవులనత్తం వద్ద శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఇంజన్లో పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించాడు. అలాగే రైలును కుప్పం వరకు డ్రైవర్ తీసుకెళ్లాడు. ఆదే ఇంజన్‌తో ముందుకు వెళ్లడం ప్రమాదమని భావించిన అధికారులు మరో ఇంజన్ కోసం వేచి చూస్తున్నారు. -
‘టీకాస్’ సఫలం
తాండూరు: ఓ ట్రాక్‌లో రైలు ఆగి ఉంది.. అదే ట్రాక్‌లో ఎదురుగా మరో ప్రత్యేక రైలు సుమారు వంద కి.మీ. వేగంతో దూసుకొచ్చింది.. రైల్వే ప్లాట్‌ఫాంపై ఉన్న ఇతర అధికారులు, సామాన్య ప్రయాణికులు ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూస్తున్నారు.. ఇంతలోనే ప్రత్యేక రైలు ఇంజిన్‌లోని ఆటోమేటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం (ఏటీపీఎస్)తో ఆగి ఉన్న రైలుకు సుమారు 100-150 మీటర్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో అందరూ సంతృప్తి వ్యక్తం చేశారు.. ఈ ప్రయోగానికి తాండూరు రైల్వేస్టేషన్ వేదికైంది. సోమవారం రైల్వే బోర్డు సభ్యుడు ఏకే మిట్టల్ (ఎలక్ట్రికల్), బోర్డు అడిషినల్ మెంబర్లు మహేష్‌మంగళ్ (టెలీకమ్యూనికేషన్స్), మనోహరన్ (సిగ్నల్స్)తోపాటు సికింద్రాబాద్ డీఆర్ఎం ఎస్కే మిశ్రా, వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ప్రయోగాలను పరిశీలించారు. ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో వారంతా తాండూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఏటీపీఎస్ (టీకాస్) ప్రయోగాలు చేస్తున్న భారత రైల్వే పరిశోధన సంస్థ (ఆర్డీఎస్ఓ) అధికారి మన్సుఖనితో కలిసి రైలు ఇంజిన్‌లో తాండూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి వెళ్లారు. కర్ణాటక రాష్ట్రంలోని కుర్గుంట, బషీరాబాద్‌లోని నవాంద్గీ, మంతట్టి రైల్వేస్టేషన్లలో ఎదురెదురుగా, పక్కపక్క ట్రాక్‌ల్లో రైళ్లను నడిపి ఏటీపీఎస్ పనితీరును క్షుణ్నంగా పరిశీలించారు. దాదాపు మూడు రైల్వేస్టేషన్ పరిధిలోని నాలుగు బ్లాక్ సెక్షన్లలో రైలు ప్రమాదాల నివారణకు చేపట్టిన ఏటీపీఎస్లోని 32 ఫీచర్స్‌ను స్టడీ చేశారు. డ్రైవర్ చేయలేనిది.. ప్రత్యేక రైలు వంద కి.మీ. వేగంతో వెళ్తుండగా.. రెడ్‌సిగ్నల్ వేయడంతో డ్రైవర్ రైలు వేగాన్ని నియంత్రించలేకపోయాడు. రైలులో ఉన్న ఏటీపీఎస్ ఆటోమెటిక్‌గా వేగాన్ని నియంత్రించి రైలును సుమారు 100 మీటర్ల దూరంలోనే ఆపేసింది. సిగ్నల్స్, లెవల్‌క్రాసింగ్‌లు తదితర చోట్ల ఏటీపీఎస్ పనితీరును, ఇంజిన్‌లోని డ్రైవర్ ఇంటర్పేస్ మానిటర్లో సిగ్నల్ ఇండికేషన్స్ తదితర అంశాలను బోర్డు సభ్యులు స్వయంగా గమనించారు. ప్రయోగాలు సంతృప్తికరం.. అనంతరం రైల్వే బోర్డు అదనపు సభ్యుడు మహేష్‌మంగళ్ తాండూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రయోగాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లింగంపల్లి-వాడీ, వికారాబాద్-బీదర్ సెక్షన్ల మధ్య ఏటీపీఎస్‌ను మార్చి, జూన్లలో అమల్లోకి తెస్తామన్నారు. ఇందుకు సంబంధించి రెండు సెక్షన్ల మధ్య టవర్లు, ఇతర సాంకేతిక పరికరాలను అమర్చుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే సుమారు 28 రైల్వేస్టేషన్లలో టవర్లు, ఇతర పరికరాలను అమర్చడం పూర్తయిందన్నారు. రెండేళ్లుగా చేసిన ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయన్నారు. కార్యక్రమంలో వివిధ వివిధ విభాగాల రైల్వే ఉన్నతాధికారులు, మూడు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నకోజరి హీరో
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన, వేల మైళ్ల దూరంలోని ఇద్దరు అన్న మాటలివి !‘ఈ రోజు మనం చేసే మంచి పనే రేపటి మన ఆనందంగా మారుతుంది’ - సోక్రటీస్ ‘ప్రపంచంలోని చెడ్డ వాళ్ల కన్నా మంచివాళ్లు తమ మంచితనాన్ని ఉపయోగించకపోవడం వల్లే ప్రజల్లో అధిక శాతం మంది దుఃఖానికి గురవుతున్నారు’ - చాణుక్యుడు 21వ శతాబ్దంలో దలైలామా ఓ సందర్భంలో ఇలా అన్నారు... ‘ఆలయాలకి వెళ్లాల్సిన పని లేదు. క్లిష్టమైన వేదాంత సారం చదవాల్సిన పని లేదు. మన హృదయమే, మన మెదడే మన ఆలయం. ఆ వేదాంతం కరుణ’. అందుకు మనిషి హృదయంలో ఓ చదరపు అంగుళం దయ ఉన్నా చాలు. అలాంటి దయ గల కొందరిని కలుసుకోండి. ఇది మీలో మంచిని ప్రేరేపించవచ్చు. నవంబర్ 7, 1907లో మెక్సికోలోని నకోజరి గ్రామంలో డైనమేట్లని రవాణా చేసే ఓ రైలు పెట్టె అంటుకుంది. ఇది గమనించిన ఇంజిన్ డ్రైవర్ జెసుస్ గార్షియా... వెంటనే రైలు ఇంజిన్ని స్టార్ట్ చేసి గ్రామానికి పది మైళ్ల దూరం తీసుకెళ్లాక డైనమేట్ అంటుకుని పేలింది. ఆ చప్పుడు ఆ గ్రామంలోని వారందరికీ వినిపించింది. అతను రైలుని వెంటనే తీసుకెళ్లి ఉండకపోతే నకోజరి గ్రామం మొత్తం ఆ పేలుడికి నాశనమైపోయేది. గ్రామాన్ని రక్షించిన గార్షియా శరీరం పేలుడి ధాటికి ఛిన్నాభిన్నమైపోయింది. అతని త్యాగానికి కృతజ్ఞతగా ఆ గ్రామానికి నకోజరి డి గార్షియా అనే పేరు పెట్టుకున్నారు. అంతేకాక మెక్సికోలోని చాలా వీధులకి అతని పేరు పెట్టారు. గార్షియా గౌరవార్థం ఏటా నవంబర్ 7న రైల్వే దినోత్సవంగా జరుపుతున్నారు. అతని త్యాగాన్ని వర్ణిస్తూ అనేక పాటలు, నాటకాలు, పద్యాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ -
విరిగిపోతున్న రైలు బోగీల కప్లింగ్‌లు
ప్యారిస్: గూడ్స్, ప్రయాణికుల రైళ్ల బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు ముఖ్య కారణం రైలు బోగీలను కలిపే కప్లింగ్‌లు విరిగిపోతుండడమేనని తెలుస్తోంది. కనుక కప్లింగ్ల పర్యవేక్షణపై రైల్వే నిర్వాహకం దృష్టి సారించడం అత్యవసరం. 10వ తేదీ వేలూరు జిల్లా, గుడియాత్తం సమీపంలో వెళుతున్న బెంగళూరు - అరక్కోణం ప్రయాణికుల రైలు ఇంజిన్ మాత్రం వేరుగా విడిపోయి పరుగులు తీసింది. బోగీలను కలిపే కప్లింగ్‌లు విరిగిపోవడంతోనే ఈ సంఘటన సంభవించిన ట్లు విచారణలో తెలిసింది. తర్వాత రోజు 11వ తేదీ అరక్కోణం సమీపంలో, ఇనుము లోడుతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 44 బోగీలతో వెళుతున్న గూడ్స్ నుంచి నాలుగు బోగీలు పట్టాలపై నుంచి పక్కకు తప్పాయి. ఈ ప్రమాదం కూడా కప్లింగ్‌లు విరిగిపోవడం వల్లనే జరిగిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై భారత రైల్వే సాంకేతిక శాఖ సూపర్వైజర్ల సంఘం నిర్వాహకులు ఒకరు మాట్లాడుతూ ప్రారంభ రోజుల్లో రైలు బోగీలను ఐఆర్ఎస్ అనబడే స్క్రూలను కప్లింగ్‌లకు ఉపయోగించారు. వీటికి పట్టు అంతగా లేకపోవడంతో ప్రమాద సమయాల్లో రైలు బోగీలు ఒకదానిపైన ఒకటి చేరే పరిస్థితి ఏర్పడుతుండేది. ఈ సంఘటనలను తప్పించే విధంగా సరకు, ప్రయాణికుల రైళ్లలో బోగీలను సెంటర్ బంపర్ కప్లింగ్‌లతో జత చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా కొన్ని సమయాలలో ఐఆర్ఎస్ కప్లింగ్‌లు, సెంటర్ బంపర్ కప్లింగ్‌లు రెండింటిని ఉపయోగించి బోగీలను జత చేయడం జరుగుతుంది. కప్లింగ్లలో చోటు చేసుకునే లోపాలను కనుగొనడం అంత సామాన్యమైన విషయం కాదు. రైలు చక్రాలు, యాక్సిల్ వంటి వాటిని అత్యాధునిక అల్ట్రా సోనిక్ పద్ధతిలో సోధనలు చేసి, పర్యవేక్షించడం జరుగుతుంది. ఆ విధంగా కప్లింగ్‌లను తనిఖీ చేయడం కుదరదు. అయినప్పటికినీ 18 నెలలకు ఒక సారి కప్లింగ్‌లను తనిఖీ చేస్తుంటాం. అనంతరం అవసరమైన వాటిని మార్చడం వాటికి మరమత్తు లు చేస్తాం. పలు సమయాల్లో తగిన దానికంటే ఎక్కువ బరువును బోగీలలో ఎక్కించడం కూడా కప్లింగ్‌లు విరిగిపోవడానికి కారణమవుతుంది. ఒక బోగీలో 60 టన్నుల బరువును మాత్రమే ఎక్కించాల్సి ఉంది. అయితే దాని కంటే ఎక్కువగా బరువు పెరిగినట్లైతే ఈ విధంగా కప్లింగ్‌లు విరిగి, రైలు బోగీలు పట్టాలు తప్పే సంఘటనలు సంభవిస్తాయని ఆయన వెల్లడించారు. -
‘తుంగభద్ర’లో సాంకేతిక సమస్య
- రెండున్నర గంటల పాటు నిలిచిన రైలు - తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు - దరిదాపుల్లోకి రాని రైల్వే అధికారులు గద్వాలన్యూటౌన్, న్యూస్‌లైన్: కర్నూలు నుంచి గద్వాల మీదు గా సికింద్రాబాద్‌కు వెళ్లే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో గద్వాల మండలం మేలచెర్వు శివారులో ఆదివారం సాయంత్రం నిలిచిపోయింది. ఇంజన్‌కు మరమ్మతులు చేసేందుకు డ్రైవర్లతో పాటు మెకానిక్‌లు ఎంతగా ప్రయత్నించినా సాధ్యపడలేదు. రెండున్నర గంటలు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కర్నూలు నుంచి మరో ఇంజన్‌ను తెప్పించడంతో రైలు కదిలింది. ఇంత జరిగినా రైల్వే అధికారులు దరిదాపుల్లోకి రాలేదు. కర్నూలు నుంచి బయల్దేరిన తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు గద్వాల రైల్వే స్టేషన్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకోవాల్సి ఉంది. అయితే ఇంజన్లో ఓవర్ స్పీడ్ టెంపరేచర్ ట్రిప్ అయ్యి ఒక్కసారిగా గద్వాల పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో మేలచెర్వు శివారులో రైలు ఆగిపోయింది. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు ఇంజన్ వచ్చింది. వెనుక భాగంలో ఇంజన్‌ను అటాచ్ చేసి రైలును కదిలించారు. గద్వాల స్టేషన్‌కు 6 గంటల 50 నిమిషాలకు చేరుకుంది. మరమ్మతులకు గురైన ఇంజన్‌ను మార్చి అటాచ్ చేసిన ఇంజన్‌ను ముందు భాగానికి మార్చి కదిలించారు. ప్రయాణికుల అవస్థలు... రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఎండ వేడిమికి తాళలేక అల్లాడిపోయారు. కర్నూలు నుంచి గద్వాలకు వచ్చే ప్రయాణికులు నడుచుకుంటూ గద్వాలకు వెళ్లారు. మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు అవస్థలకు గురయ్యారు. పిల్లాపాపలతో వచ్చిన వారు మరింత ఇబ్బందులు పడ్డారు. కనీసం తాగునీరు లేక అల్లాడిపోయారు. సమీపంలోని చేతిపంపును ఆశ్రయిం చారు. అక్కడ కూడా కొద్దిసేపు మాత్రమే నీరు వచ్చి ఆగి పోయింది. విషయం తెలుసుకున్న మేలచెర్వు సర్పంచ్ వేణుగోపాల్‌రెడ్డి ట్యాంకర్‌ను తెప్పించి ప్రయాణికుల దాహార్తిని తీర్చారు. సందట్లో సడేమియాగా రైలులో వాటర్ బాటిళ్లు, టీని విక్రయించే చిరువ్యాపారస్తులు ప్రయాణికులను నిలువునా దోచుకున్నారు. ఇదిలా ఉం టే గద్వాల నుంచి మహబూబ్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన చాలా మంది టికెట్లను వాపసు చేశారు. పత్తాలేని రైల్వే అధికారులు! రెండున్నర గంటల పాటు రైలు నిలిచిపోయి నా రైల్వే అధికారులు స్పందించలేదు. ఒక్క అధికారి సైతం సంఘటన స్థలానికి చేరుకోలేదు. అస లు రైలు కదులుతుందా? మరో ఇంజన్ వస్తుందా? అన్న విషయం కూడా తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అక్కడున్న మె కానిక్‌లను కొంత మంది ప్రయాణికులు ప్రశ్నించగా..సరైన సమాధానం రాలేదు. రైల్వే ప్రయాణికుల పట్ల అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని పలువురు ప్రయాణికులు ఆరోపించారు. -
కూతకు ‘రైలింజన్’ సిద్ధం
సాక్షి, ముంబై: లోకసభ ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రముఖ పార్టీలన్నీ ఎన్నికలు ప్రచారం ప్రారంభించగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఉగాది నుంచి ప్రచారాన్ని ప్రారంభించనుంది. మార్చి 31వ తేదీ సోమవారం నుంచి లాంఛనంగా ప్రచారం ప్రారంభిస్తున్నా ప్రత్యక్షంగా మాత్రం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఏప్రిల్ ఒకటవ తేదీ మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా మార్చి 31వ తేదీ పుణే జిల్లా కార్లేలోని ఏక్వీరా దేవి మాతాను దర్శించుకోనున్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ పుణే జిల్లా జున్నర్ నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. శంకరపూరాలో జరగనున్న బహిరంగ సభలో ఎమ్మెన్నెస్ అభ్యర్థి అశోక్ ఖండెభరాడ్ కోసం ప్రచారం చేస్తారు. అనంతరం ఏప్రిల్ రెండున డోంబివలిలో, మూడవ తేదీ ముంబై గోరేగావ్, నాలుగవ తేదీ నవీ ముంబై, అయిద న నాసిక్, ఆరున పుణే, ఏడవ తేదీన యావత్మాల్లో తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. గత లోకసభ ఎన్నికల్లో 13 మందిని బరిలోకి దింపిన ఎమ్మెన్నెస్ ఈసారి కేవలం 10 మందిని బరిలోకి దింపింది. దీంతో ప్రణాళికాబద్ధంగా ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని స్థానిక నేతలు ప్రచారాలు ప్రారంభించారు. ప్రచార రథాలు సిద్ధం... ఎన్నికల ప్రచారాల కోసం అందరి మాదిరిగానే ఎమ్మెన్నెస్ కూడా ప్రచార రథాలను సిద్ధం చేసుకుంది. బీజేపీ కమలంతో రథాన్ని రూపొందించుకోగా కాంగ్రెస్ చేతిగుర్తుతో ఉన్న రథాన్ని రూపొందించుకుంది. ఎమ్మెన్నెస్ కూడా తన పార్టీ గుర్తు అయిన రైలు ఇంజిన్‌తో అనేక ప్రచార రథాలను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే అనేక రథాలు సిద్ధమైనప్పటికీ చివరి విడతలో కానున్న ఠాణే, ముంబై లాంటి ప్రాంతాల కోసం ఇంకా ప్రచార రథాలు సిద్ధం చేస్తూనే ఉన్నారు.