
చెన్నై,తిరువొత్తియూరు: ఈరోడ్‌లో ఓ రైలు ఇంజిన్ మనిషి తలతో వచ్చింది. వివరాలు..మైసూర్ నుంచి మైలాడుదురై వెళ్లే రైలు ఇంజన్ ఈరోడ్ నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు బయలుదేరింది. ఇందుకోసం రైలు ఇంజిన్ ఈరోడ్ డీజిల్ లోకో షెడ్‌కు వెళ్లింది. ఆ సమయంలో రైలు ఇంజిన్ ముందు భాగంలో మనిషి తల చిక్కుకొని వేలాడుతూ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న ఈరోడ్ రైల్వేస్టేషన్ సహాయ మేనేజర్ కలుశేఖరన్, రైల్వే పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. తరువాత మనిషి తలను బయటకు తీసి ఈరోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు. రైలు పట్టాలు దాటుతున్న సమయంలో తల ఖండించబడి ఇంజిన్‌కు చిక్కుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రైలు ఇంజిన్ వచ్చే మార్గంలో అన్ని రైల్వేస్టేషన్లకు దీని గురించి సమాచారం అందించారు. రైల్వే పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.