కోకనాడ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజన్‌లో మంటలు
కైకలూరు స్టేషన్‌లో ఘటన.. తప్పిన భారీ ప్రమాదం
కైకలూరు: కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే కోకనాడ ఎక్‌ప్రెస్ (ట్రెయిన్ నంబరు 12775) రైలు ఇంజన్ కృష్ణాజిల్లా కైకలూరు రైల్వేస్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి మంటల్లో చిక్కుకుంది. కాకినాడ నుంచి బయలుదేరి రాత్రి 11.16 గంటలకు కైకలూరుకు రావాల్సిన రైలు ఆలస్యంగా 11.50 గంటలకు చేరుకుంది.
స్టేషన్‌లో ఆగిన కొంతసేపటికే రైలు ఇంజన్ నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడాన్ని సిబ్బంది గమనించారు. వెంటనే అప్రమత్తమై బోగీల నుంచి ఇంజన్‌ను వేరు చేశారు. అప్పటికే ఇంజన్ నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. రైల్వే సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలానికి చేరకున్న కైకలూరు ఫైర్‌స్టేషన్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. వేరే ఇంజన్ ఏర్పాటు చేసి రాత్రి 1:40 సమయంలో రైలు సికింద్రాబాద్‌కు పంపారు.