
ధ్వంసమైన బోగిని పరిశీలిస్తున్న ఏకే గుప్తా
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్‌ఫామ్‌లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు.
రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment