DRM
-
సౌరభ్ ప్రసాద్ రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా అరెస్టు
-
వాల్తేరులో వణుకు
సాక్షి, విశాఖపట్నం : ‘ఈయన మంచి డీఆర్ఎం.. మాకు టెండరు కావాలని అడిగితే.. ఎంతిచ్చినా తీసుకొని ఆ పనులు మాకే వచ్చేటట్లు చూసేవాళ్లు. అలాంటి మంచివ్యక్తిని సీబీఐ పట్టుకోవడమేంటి సార్..?’’.. రైల్వే సంబంధిత పనులు చేపట్టే ఓ కాంట్రాక్టర్ చెప్పిన మాటలివీ.. సదరు కాంట్రాక్టర్.. తనకు రావాల్సిన పనులు ఆగిపోతాయేమోనన్న ఆందోళనతో చెప్పినా.. వాల్తేరు డీఆర్ఎం వ్యవహారమేంటనేది ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి. వాల్తేరు డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్‌కుమార్ ప్రసాద్.. ముంబైలో శనివారం ఉదయం లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. డీఆర్ఎంపై దర్యాప్తు బృందం దాడితో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు, ఉద్యోగులు ఉలిక్కి పడుతున్నారు. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టే ఉద్యోగులు తమ పరిస్థితేంటనే ఆందోళనలో ఉన్నారు. రెండేళ్ల నుంచీ సీబీఐ నిఘా...! వాస్తవానికి.. సీబీఐతో డీఆర్ఎం సౌరభ్‌కు కొత్త పరిచయం కాదని తెలుస్తోంది. గతంలో వాల్తేరు డీఆర్ఎంగా రాకమునుపు సెంట్రల్ రైల్వే జోన్లో ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ (పీసీఎంఈ)గా విధులు నిర్వర్తించే వారు. ఈయనకు ముందు పీసీఎంఈగా వ్యవహరించిన అధికారి.. రూ.లక్ష లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. అనంతరం నిర్వహించిన సోదాల్లో రూ.23 లక్షలు, రూ.40 లక్షల విలువైన ఆభరణాలు, రూ.13 కోట్ల విలువైన ఆస్తులు, సింగపూర్, యూఎస్ బ్యాంకుల్లో రూ.1.63 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లుగా సీబీఐ అధికారులు గుర్తించారు. ఆయన స్థానంలో పీసీఎంఈగా విధుల్లోకి వెళ్లిన సౌరభ్‌పై అప్పటి నుంచి కేంద్ర దర్యాప్తు బృందం నిఘా పెట్టింది. పలుమార్లు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వైజాగ్ నుంచి ఫాలో చేస్తూ.. టెండర్ పాస్ చేసేందుకు లంచం అడుగుతున్నారంటూ ఓ కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించారు. దీంతో విశాఖ నుంచి దర్యాప్తు బృందం అధికారులు డీఆర్ఎం కదలికలపై నిఘాపెట్టారు. ముంబై వెళ్తున్నట్లు సమాచారం తెలుసుకొని అక్కడ బృందాల్ని అలెర్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకోవడం.. మెర్సిడెస్ కారులో ఇంటికి వెళ్లిన వెంటనే సీబీఐ అధికారులు డీఆర్ఎంను అదుపులోకి తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండేళ్ల నుంచి నిఘా కొనసాగించిన సీబీఐ అధికారులకు ఎట్టకేలకు శనివారం చిక్కారని సమాచారం. సీబీఐ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఎంతిచ్చినా ఓకే.?? లంచం వ్యవహారంలో సౌరభ్ చిక్కడంతో.. ఆయన చేసిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కాంట్రాక్టర్లతో నిరంతరం..డీఆర్ఎం కార్యాలయం బిజీ బిజీగా ఉండేదని తెలుస్తోంది. సివిల్, మెకానికల్ విభాగాలకు సంబంధించి టెండర్ల ద్వారా వచ్చిన డబ్బుల వసూళ్లకు డీఆర్ఎం కార్యాలయంలోని ఇద్దరు ఉద్యోగుల్ని ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. టెండర్లు ఎవరికి రావాలంటే.. పని విలువ బట్టి వసూళ్లు రాబట్టేవారని వాల్తేరు డివిజన్ వర్గాలు చెబుతున్నాయి. రూ.50 వేల నుంచి వసూళ్ల పర్వం మొదలయ్యేదని కొందరు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. డబ్బులిచ్చిన వారికే పనులకు సంబంధించిన టెండర్లు దక్కేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్ఎం అండ్ కో బ్యాచ్‌పై పలుమార్లు ఉన్నతాధికారులకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. విశాఖ రైల్వే పరువు తీసేశారు.! వాల్తేరు డివిజన్ చరిత్రలో సీబీఐ దాడుల్లో ఒక ఉద్యోగి, లేదా అధికారి పట్టుబడటం ఇదే మొదటిసారని ఉద్యోగులు చెబుతున్నారు. గతంలో డీఆర్ఎంలుగా వ్యవహరించిన అనూప్‌కుమార్ సత్పతి, చేతన్‌కుమార్ శ్రీవాత్సవ్.. డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించారని.. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అంటున్నారు. ఎక్కడా అవినీతికి తావులేకుండా.. ప్రతి అంశంలోనూ పారదర్శకంగా వ్యవహరిస్తూ.. తప్పు చేసిన ఉద్యోగులను బదిలీలు, సస్పెన్షన్లు చేసేవారని చెబుతున్నారు. సదరు సౌరభ్ వచి్చన తర్వాత.. ఫిర్యాదులిస్తున్నా పట్టించుకోకుండా వాళ్లతో మిలాఖత్ అయిపోయేవారని కొందరు ఆరోపిస్తున్నారు. మొత్తంగా సీబీఐ వ్యవహారంతో విశాఖ రైల్వే డివిజన్‌పై మచ్చపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరిలో టెన్షన్ డీఆర్ఎంపై సీబీఐ దాడులతో.. డివిజన్లో ఉద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. డీఆర్ఎం వ్యవహారాలు చక్కబెట్టిన ఇద్దరు ఉద్యోగులు.. సెలవుపై వెళ్లిపోయేందుకు ప్రయతి్నస్తున్నట్లు సమాచారం. అయితే.. సెలవులో వెళ్తే.. సీబీఐ దృష్టిలో పడతారంటూ సహచరులు చెప్పడంతో ఏం చెయ్యాలో పాలుపోక ఎప్పుడు తమని సీబీఐ విచారణకు పిలుస్తారోనంటూ బిక్కుబిక్కుమంటున్నారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
-
Secunderabad Railway Station: రైల్వేకు నష్టం రూ.12 కోట్లు
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంలో ప్రత్యక్షంగా రూ.12 కోట్ల నష్టం వాటిల్లిందని, పరోక్షంగా కూడా కోట్లలో నష్టం ఉంటుందని డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. శనివారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 బోగీలు, 5 రైలు ఇంజన్లు దెబ్బతిన్నాయని.. ప్లాట్‌ఫామ్‌లపై సీసీ కెమెరాలు, టీవీలు, దుకాణాలు, పార్శిళ్లకు పూర్తిగా నష్టం వాటిల్లిందని ఏకే గుప్తా చెప్పారు. రైళ్లు రద్దు కావడంతో జరిగే చెల్లింపులు, పార్శిళ్లు, ఇతర పరోక్ష నష్టాలను అంచనా వేస్తున్నామని తెలిపారు. రైల్వే ప్రయాణికుల లగేజీ కూడా నష్టం జరిగిందన్నారు. రైల్వే సిగ్నల్ వ్య వస్థకు ఎలాంటి నష్టం జరగలేదని.. శుక్రవా రం రాత్రి నుంచే రైళ్లను పునరుద్ధరించామని చెప్పారు. రైళ్లన్నీ యథావిధిగా నడుస్తున్నాయన్నారు. అదృష్టవశాత్తు పవర్ కార్కు ఎలాంటి నష్టం జరగలేదని, అందులో 3 వేల లీటర్ల డీజి ల్ ఉండటం వల్ల నిప్పంటుకుంటే నష్టం తీవ్రం గా ఉండేదని తెలిపారు. ఇందులో కుట్ర కోణ మేదైనా ఉందా అన్నదానిని దర్యాప్తు సంస్థలు తేలుస్తాయన్నారు. ఘటనలో 8 మంది రైల్వే సిబ్బందికి స్వల్పగాయాలైనట్టు చెప్పారు. -
శ్రీమంతుడు సినిమాలోలా.. రైలు వదిలి సైకిలెక్కి!
తాటిచెట్లపాలెం: ఆయన వాల్తేరు డివిజన్ డీఆర్ఎం. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు గ్రామంలో పర్యటించినట్టు డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి కూడా తాటిచెట్లపాలెం రైల్వే కాలనీలో పర్యటించారు. కాలనీ మొత్తం సైకిల్‌పైనే ప్రయాణించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకున్నారు. కాలనీ ప్రజలతో మాట్లాడారు. సదుపాయాలు, వసతులు, పారిశుధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, పార్కుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. పారిశుధ్య, పరిశుభ్రత, సెక్యూరిటీ విషయంలో అశ్రద్ధ వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సిబ్బందిని హెచ్చరించారు. ఆయన వెంట సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధికారులు, పర్యావరణ, ఆరోగ్య విభాగ సిబ్బంది ఉన్నారు. -
‘ఆ పిల్లల వివరాలు వెబ్సైట్లో పెడుతున్నాం’
సాక్షి, విజయవాడ : ఇంట్లోంచి పారియపోయి వచ్చిన పిల్లలను గుర్తించి వారిని తిరిగి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడమే తమ ప్రధాన ఉద్దేశం అంటున్నారు సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్ఎం ఆర్ ధనుంజయ్. శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడిన ధనుంజయ్ 2017 సంవత్సరంలో దాదాపు 230 మంది ఇంట్లోంచి పారిపోయి వచ్చిన పిల్లలను రైల్వే ప్రోటక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) రెస్క్యూ టీం కాపాడారని తెలిపారు. అయితే ఈ ఏడాది వీరి సంఖ్య పెరిగిందని చెప్పారు. 2018 సంవత్సరంలో ఇప్పటివరకూ దాదాపు 246 మంది ఇలా ఇంటి నుంచి పారిపోయి వచ్చారని తెలిపారు. ఇలా పట్టుకున్న పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. తాము కాపాడిన పిల్లల ఫోటోలను ఆర్పీఎఫ్ వెబ్ పోర్టల్‌లో పెడుతున్నాని వెల్లడించారు. దాంతో పాటు ప్రస్తుతం ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో వారి అడ్రస్‌తో పాటు ఫోన్ నెంబర్లను వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియాలో కూడా పెడుతున్నట్లు తెలిపారు. -
సత్యదేవుని దర్శించిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం
అన్నవరం : దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం అశోక్‌కుమార్ దంపతులు బుధవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్విదించి, ప్రసాదాలను అందజేఆరు. ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించండి... డీఆర్ఎం అశోక్‌కుమార్‌ను దేవస్థానం ఈఓ మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నవరం రైల్వేస్టేషన్లో గరీబ్ రధ్, కోణార్క్, లోకమాన్యతిలక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు అన్నవరం రైల్వేస్టేషన్ హాల్ట్ కల్పించాలని కోరారు. అదేవిధంగా మూడో నెంబర్ ఫ్లాట్‌ఫాం పక్కన గల ఖాళీ స్థలంలో దేవస్థానం నిధులతో షెడ్డు నిర్మిస్తామని, అందులో ఆటోమే టిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఆర్ఎం అంగీకరించారు. సమయంలేక.. అన్నవరం రైల్వేస్టేషన్‌ను బుధవారం మధ్యాహ్నం డీఆర్ఎం తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆయన సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. సత్యదేవుని దర్శనం అయ్యే సరికే ఆరున్నర గంటలు అయింది. దీంతో సమయం లేక రైల్వేస్టేషన్‌ను పరిశీలించకుండానే విజయవాడ బయలుదేరి వెళ్లిపోయారు. ఆయన వెంట సీనియర్ డీసీఎం సిఫాలీ, స్టేషన్ టీటీఈ కిరణ్ తదితరులున్నారు. -
రైల్వేస్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఆర్ఎం
వసతులపై సీసీఐ,ఎస్‌ఎంలపై ఆగ్రహం ఆటో, టూవీలర్ పార్కింగ్‌పై దృష్టిపెట్టాలని సూచన ప్రయాణికులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశం ఖమ్మం మామిళ్లగూడెం: ఖమ్మం రైల్వేస్టేషన్‌ను శుక్రవారం రైల్వే డీఆర్ఎం ఆశీష్ అగర్వాల్ అకస్మికంగా తనఖీ చేశారు. స్టేషన్ పనితీరుపై సీసీఐ సురేందర్, ఎస్ఎం సూర్యచంద్రరావులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం డీఆర్ఎం కృష్ణా పుష్కరాలకు విజయవాడలో హాజరై తిరుగు ప్రయాణంలో ఖమ్మం రైల్వే స్టేషన్‌ను సందర్శించారు.స్టేషన్‌ను పూర్తి స్థాయిలో పరిశీలించి అసౌకర్యాల ఆరా తీశారు. స్టేషన్లో ప్లాట్‌ఫాంలను,బుకింగ్,ఏటీవీఎం,మంచినీటి వసతి,వెయిటింగ్ హాల్‌ను పరిశీలించారు. అనంతరం సౌకర్యాల పట్ల ప్రయాణికులను డీఆర్ఎం అడిగి తెలుసుకుని పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ ప్రాంగణం బయట వాహనాల పార్కింగ్‌కు అధికంగా స్థలం కేటాయింపుపై, పుష్కరాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. డీఆర్ఎం వెంట సీనియర్ డీసీఎం సత్యనారాయణ,సీడీఓఎం క్రిష్టోఫర్, ఎస్డీఎస్ఓ మీనా,ఏడీజేఈ శ్రీనాథ్, ఖమ్మం కమర్శియల్ ఇన్స్పెక్టర్ సురేందర్,ఎస్ఎం సూర్యచంద్రారావు, సీఐ రాజు,ఎస్ఐ సుబ్బారావు ,రైల్వేసిబ్బంది చౌదరి, జావీద్ పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీతో అధికారుల ఇక్కట్లు విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లి తిరుగుముఖంలో సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలులో బయలు దేరిన డీఆర్ఎం ఖమ్మం వస్తున్నారని అర్ధగంటముందు తెలుసుకున్న అధికారులు ఇక్కట్లు పడాల్సి వచ్చింది. డీఆర్ఎం వస్తున్న విషయంపై అధికారులు ఆగమేఘాల మీద స్టేషన్ ప్రాంగణాన్ని యుద్ధప్రాతిపదికన పరిశ్రుభత పనులు చేపట్టారు. ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయలేకపోయారు. ఏటీవీఎంలు ఉన్నప్పటికీ ప్రయాణికులు అంతగా అటువైపు చూడటం లేదు. అర్భాటంగా స్టేషన్లో ఏర్పాటు చేసిన ఏటీవీఎంలకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. దీంతో సొంతగానే రిటైర్డ్ ఉద్యోగులతో వాటి సేవలు కొనసాగుతున్నారు. -
రేణిగుంట రైల్వే స్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు
రేణిగుంట రైల్వే స్టేషన్లో డీఆర్ఎం తనిఖీలు రేణిగుంట : గుంతకల్ డివిజన్ రైల్వే మేనేజర్ గోపీనాథ్ మాల్యా ఆదివారం రేణిగుంట రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. మొదటి ప్లాట్‌ఫాం చివరన ఉన్న పెండింగ్ పనులను పరిశీలించారు. అలాగే రైల్వే స్టేషన్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. స్టేషన్‌లోని ప్రయాణికుల వెయిటింగ్ హాళ్ల పరిస్థితి, ప్లాట్ ఫాంలపై సదుపాయాలను గమనించారు. ఈ తనిఖీల్లో పనుల సీనియర్ సెక్షన్ ఇంజినీర్ సాంబమూర్తి, స్టేషన్ మేనేజర్ సుబోథ్ మిత్రా, ఏడీఎన్ శ్రీనివాస్, చీఫ్ హెల్త్ ఇన్స్పెక్టర్ సతీష్‌కుమార్ పాల్గొన్నారు. -
పైకి ఒకలా.. లోపల మరోలా
మహాపర్వమైన పుష్కర పనుల్లో అధికారులు పైకి చెప్పేది ఒకటి, లోపల చేసేది మరొకటి అన్నట్టు తయారైంది పరిస్థితి. ‘డబ్బుల్లేవు ఏం చేద్దాం?’ అని సమావేశాల్లో చర్చించుకుంటున్నారు. పైకి మాత్రం ‘ఘనంగా చేస్తాం’ అంటూ డంబాలు పలుకుతున్నారు. చూడబోతే కీలకమైన పనులు కూడా ఇప్పటికీ ప్రారంభంకాని నేపథ్యంలో పుష్కరాలు ఏ మేరకు జయవంతం కాగలవన్న సందేహం వ్యక్తమౌతోంది. సాక్షి, రాజమండ్రి :పుష్కర సన్నాహాలపై ఇటీవల జరిగిన సమావేశాల్లో అధికారుల మధ్య జరిగిన చర్చలు, చేపట్టిన చర్యల సారాంశం చూస్తే అసలు ‘ఏం జరుగుతోంది? ఏమీ జరక్కుర డానే ఏదో జరుగుతోందన్న భ్రాంతి కల్పిస్తున్నారా?’ అనే అయోమయం కలుగుతోంది. గడచిన మూడు వారాలుగా ప్రతి మంగళవారం పుష్కరాల ప్రత్యేకాధికారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు సమావేశం అవుతూ పుష్కరాల పనులను సమీక్షిస్తున్నారు. సమావేశాల్లో చర్చకు వస్తున్న అంశాలపై వారు బయటకు చెబుతున్న దానికి, లోపల కొనసాగుతున్న చర్చకు పొంతన ఉండడంలేదు. గత మంగళవారం రాజమండ్రి పర్యటనకు వచ్చిన రైల్వే డీఆర్ఎం మీడియాతో మాట్లాడుతూ ‘పుష్కరాల్లో భక్తులకు ఎక్కడా సదుపాయాల్లో లోటు రానివ్వం. ఘనంగా పుష్కరాలు నిర్వహించేందుకు సహకరిస్తాం. ఎన్ని ఏర్పాట్లు కావాలన్నా చేస్తాం’ అన్నారు. ఇదే అధికారి సమీక్షలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ప్రత్యేకాధికారి జె.మురళితో చర్చల్లో ‘రైల్వే బోర్డు ఇప్పటికి పైసా ఇవ్వలేదు. అయినా మేం ఏర్పాట్లకు ముందుకు వచ్చాం. లెక్కకు మిక్కిలిగా అవసరమైన పనులకు నిధులు వెచ్చించే వీలు మాకు లేదు’ అని అసలు సంగతి చల్లగా చెప్పారు. ఇదీ మత్స్య శాఖ గోడు... మత్స్యశాఖ జిల్లాలోని 179 స్నానఘట్టాల్లో రక్షణ బోట్లను ఏర్పాటు చేసి, గజ ఈతగాళ్లను నియమించేందుకు రూ.2.5 కోట్లు కావాలని ప్రతిపాదించింది. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ అంశాన్ని సమీక్షలో ఆ శాఖ అధికారులు లేవనెత్తారు. దీనికి కలెక్టర్ సమాధానం ఇలా ఉంది.. ‘ముందు మీరు బోట్లను సమకూర్చుకుని, ఈతగాళ్లకు ఆదేశాలు ఇచ్చేయండి. వారిని విధులకు సిద్ధంగా ఉండమనండి. తర్వాత నిధులు వస్తే ఇచ్చేద్దాం’. ఇందుకు స్పందించిన అధికారి ‘గతంలో శివరాత్రి, గణేశ నిమజ్జనాలకు రూ.90 లక్షలు వెచ్చించి రక్షణ ఏర్పాట్లు చేశాం. ఇప్పటికింకా ఆ నిధులు రాలేదు’ అని వాపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తుతుందనే భయాన్ని ఆ అధికారి వ్యక్తం చేశారు. నాణ్యతపై వారికే భరోసా లేదు.. ‘పనుల్లో పారదర్శకత’ అని అధికారులు, ‘ఎక్కడా రాజీ పడకుండా పను’లని ప్రజాప్రతినిధులు ఊదరగొడుతున్నారు. కానీ పుష్కర పనుల నాణ్యతపై వారికే నమ్మకం లేకుండా పోతోంది. రాజమండ్రి- కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న రోడ్డుకం రైలు వంతెనకు రూ.మూడు కోట్లతో మరమ్మతులు ప్రతిపాదించారు. టెండర్లు కూడా రెండు రోజుల క్రితం ఖరారైనట్టు ఆర్అండ్బీ అధికారులు చెప్పారు. పనులు చేపట్టి నెల రోజుల్లో ముగించేస్తామని ఆ శాఖ ఈఈ సత్యనారాయణ గత సమీక్షలో చెప్పారు. కానీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం పనులు పుష్కరాలకు నెల రోజుల ముందు ముగించేలా చర్యలు చేపట్టమని ఆదేశించారు. ఎందుకో ఆయన మాటల్లోనే చూద్దాం.. ‘మీరు మూడు నెలల ముందే వంతెనపై రోడ్డు బాగుచేస్తే పుష్కరాల నాటికి పాడైపోవచ్చు. అందుకే ఏప్రిల్‌లో చేపట్టి మేనాటికి పూర్తయ్యేలా చూడండి. రోడ్డు కాస్త పుష్కరాల నాటికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడే వేస్తే మళ్లీ పాడైపోయే ప్రమాదం ఉంది’. గోరంట్ల కలెక్టర్, ప్రత్యేకాధికారుల సమక్షంలో ఆర్అండ్బీ అధికారులతో అన్న మాటలివి. ఇంకా కోతల్లోనే... ఈ నెల 15 నాటికల్లా పనులు ప్రారంభం అయ్యేలా చర్యలు చేపడుతున్నట్టు అధికారులు ఈ నెల మూడున జరిగిన సమావేశంలో చెప్పారు. కానీ ఇంతవరకూ టెండర్ల ప్రక్రియ కొలిక్కి రాలేదు. కాగా పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖలు ప్రతిపాదించిన పనులకు నిధులు విడుదల కాలేదు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వాళ్లు ప్రతిపాదించిన దానిలో ముఖ్యమైనవి గుర్తించి సాధికారిత కమిటీ ద్వారా మంజూరుకు రికమండ్ చేస్తామన్నారు. ఇదీ.. చేరువవుతున్న మహాపర్వానికి సంబంధించిన పనుల్లో మన అధికారులు, ప్రజాప్రతినిధుల తీరు, తంతు. -
డీఆర్ఎంకు వెళ్లని భారత్
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్ల సంఖ్యపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ కారణంగా సోమవారం ఇంచియాన్‌లో జరిగిన కీలక డెలిగేట్స్ రిజిస్ట్రేషన్ మీటింగ్ (డీఆర్ఎం)కు భారత్ హాజరుకాలేకపోయింది. దీంతో ఆటగాళ్ల అక్రిడిటేషన్‌కు గుర్తింపు ఉండకపోగా వీరు గేమ్స్ విలేజిలోకి వెళ్లేందుకు కూడా ప్రవేశం లభించదు. ‘ఇది నిజంగా భారత్‌కు ఇబ్బందికర పరిస్థితి. సోమవారం ఉదయం డీఆర్ఎంలో పాల్గొనే విషయంపై గేమ్స్ నిర్వాహక కమిటీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని చెప్పాను. ఆసియాలో బలమైన క్రీడాశక్తిగా ఉన్న భారత్ డీఆర్ఎంకు మిస్ అవడం శోచనీయం. చిన్న చిన్న దేశాలు ఇందులో పాల్గొన్నాయి. ఈనెల 11 వరకు మనకు సమయం ఇవ్వమని నిర్వాహకులను కోరాను’ అని భారత ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా అన్నారు. -
రైల్వేస్టేషన్లను పరిశీలించిన డీఆర్ఎం
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ :వచ్చేనెల 6న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ జిల్లాలోని రైల్వేస్టేషన్లను తనిఖీ చేయనున్న నేపథ్యంలో విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) ప్రదీప్‌కుమార్ సోమవారం భీమవరం టౌన్, జంక్షన్, తణుకు రైల్వేస్టేషన్లను పరిశీలించారు. స్టేషన్లలోని ప్లాట్‌ఫారాలను, ఆరు బయట ప్రాంతాలను, రిజర్వేషన్, టికెట్ కౌంటర్లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. టౌన్ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబర్ ఫ్లాట్‌ఫారంపై చేస్తున్న పనులను, లిఫ్ట్ వద్ద చేస్తున్న టైల్స్ ఏర్పాట్లను పరిశీలించారు. స్టేషన్లో నూతనంగా నిర్మించిన ఆఫ్టికల్ ఫైబర్ కేబుల్ (ఓఎఫ్సీ) భవనాన్ని ఆయన పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. భవనంలో చేయాల్సిన మార్పులను వివరించారు. ప్రయాణికుల కోసం అదనంగా నిర్మిస్తున్న కుళాయిలను త్వరితగతిన నిర్మించాలని చెప్పారు. స్టేషన్ ఆవరణలో బ్యూటిఫికేషన్ కోసం చేపట్టాల్సిన చర్యలను స్టేషన్ సూపరింటెండెంట్ గణపతిరాజుకు సూచించారు. పెండింగ్ మరమ్మతులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. భీమవరం టౌన్ ైరైల్వేస్టేషన్‌లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంచినందుకు డీఆర్ఎం ప్రదీప్‌కుమార్ స్టేషన్ సూపరింటెండెంట్ గణపతిరాజుకు రూ.3 వేలు రివార్డును అందించారు. భీమవరం డివిజన్లో రైల్వే ఆస్తులను పరిరక్షించడంలో కృషి చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ఫీఎఫ్) సీఐ హులీనాయక్‌కు రూ.2 వేలు రివార్డును అందించారు. డీఆర్ఎం వెంట పలువురు అధికారులు ఉన్నారు.