సత్యదేవుని దర్శించిన దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం
Published Wed, Nov 9 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
అన్నవరం : దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం అశోక్‌కుమార్ దంపతులు బుధవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘనస్వాగతం పలికారు. స్వామి దర్శనం తర్వాత వేదపండితులు ఆశీర్విదించి, ప్రసాదాలను అందజేఆరు.
ఎక్స్‌ప్రెస్‌లకు హాల్ట్ కల్పించండి...
డీఆర్‌ఎం అశోక్‌కుమార్‌ను దేవస్థానం ఈఓ మర్యాదపూర్వకంగా కలిశారు.
సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్నవరం రైల్వేస్టేషన్‌లో గరీబ్ రధ్, కోణార్క్, లోకమాన్యతిలక్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు అన్నవరం రైల్వేస్టేషన్ హాల్ట్ కల్పించాలని కోరారు. అదేవిధంగా మూడో నెంబర్ ఫ్లాట్‌ఫాం పక్కన గల ఖాళీ స్థలంలో దేవస్థానం నిధులతో షెడ్డు నిర్మిస్తామని, అందులో ఆటోమే టిక్ టిక్కెట్ వెండింగ్ మిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి డీఆర్‌ఎం అంగీకరించారు.
సమయంలేక..
అన్నవరం రైల్వేస్టేషన్‌ను బుధవారం మధ్యాహ్నం డీఆర్‌ఎం తనిఖీ చేయాల్సి ఉంది. అయితే ఆయన సాయంత్రం ఆరు గంటలకు అన్నవరం దేవస్థానానికి చేరుకున్నారు. సత్యదేవుని దర్శనం అయ్యే సరికే ఆరున్నర గంటలు అయింది. దీంతో సమయం లేక రైల్వేస్టేషన్‌ను పరిశీలించకుండానే విజయవాడ బయలుదేరి వెళ్లిపోయారు. ఆయన వెంట సీనియర్ డీసీఎం సిఫాలీ, స్టేషన్ టీటీఈ కిరణ్ తదితరులున్నారు.
Advertisement
Advertisement