మానసిక స్థితి నిలకడలేని వ్యక్తి తల్లి, భార్యను హత్య చేశాడు.
లక్నో: మానసిక స్థితి నిలకడలేని వ్యక్తి తల్లి, భార్యను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర ప్రాంతంలోని సవారా గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
సంతోష్ కుమార్ దుబె అనే వ్యక్తి కర్రెతో తల్లి ప్రాణమతి (60), భార్య సంగీతను బాదాడు. ప్రాణమతి అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన సంగీత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సంతోష్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.