ప్రియురాలి మోజులో.. | man attack on wife and mother | Sakshi
Sakshi News home page

ప్రియురాలి మోజులో..

Published Sat, Jan 13 2018 7:49 AM | Last Updated on Fri, Jul 27 2018 2:21 PM

man attack on wife and mother - Sakshi

బనశంకరి: ప్రియురాలి మోజులో పడి వ్యక్తి భార్య,త న తల్లిపై దాడికి యత్నించిన శుక్రవారం నగరంలోని పులకేశినగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. నగరంలో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న రోహిత్‌కు స్నేహ అనే యువతితో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహం అనంతరం రోహిత్‌ భార్య స్నేహ, తల్లి నందారలతో కలసి పులకేశినగర్‌లో ఉంటున్నాడు. అయితే కొద్ది కాలం క్రితం అవంతిక అనే యువతితో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సం బంధానికి దారి తీయడంతో రోహిత్‌ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసాడు.

దీంతో తల్లి నందా ర, భార్య స్నేహాలు ఇదే విషయమై రోహిత్‌తో గొడవ పడుతుండేవారు. శుక్రవారం కూడా ఇదే విషయమై ముగ్గురి మధ్య గొడవ చోటు చేసుకోవడంతో ప్రియురాలు అవంతికతో కలసి రోహిత్‌ తన తల్లి నందార, భార్య స్నేహలపై దాడికి యత్నించాడు. వీరి కేకలు విన్న స్థానికులు వెంటనే నందార, స్నేహలను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. నందార, స్నేహల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement