తల్లిని ఒకరు.. భార్యను ఒకరు చంపేశారు | Man kills mother, another his wife, both commit suicide | Sakshi
Sakshi News home page

తల్లిని ఒకరు.. భార్యను ఒకరు చంపేశారు

Published Mon, Nov 2 2015 3:23 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

తల్లిని ఒకరు.. భార్యను ఒకరు చంపేశారు - Sakshi

తల్లిని ఒకరు.. భార్యను ఒకరు చంపేశారు

అగర్తల: త్రిపురలో ఆవేశం కారణంగా రెండు చోట్ల జరిగిన వేర్వేరు సంఘటనల్లో నాలుగు ప్రాణాలు బలయ్యాయి. ఓ వ్యక్తి తన తల్లిని హతమార్చి ఆత్మహత్య చేసుకోగా మరొకరు తన భార్యను చంపేసి తానూ చనిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లగా.. జయదీప్ చక్రవర్తి (51) అనే వ్యక్తి అగర్తలలో తన తల్లి జ్యోత్స్నా చక్రవర్తి(70)ని గొంతునులిమి హతమార్చాడు.

అనంతరం అదే గదిలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అగర్తల శివారు ప్రాంతంలో ఈఘటన చోటుచేసుకుంది. ఇక ఇదే ప్రాంతంలో సురీందర్ మట్టి (27) అనే బీఎస్ఎఫ్ జవాను తన భార్య ఖుషిదేబ్ నాథ్ (24)పై కాల్పులు జరిపి చంపి అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement