
మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం
విశాఖపట్నం నగరంలోని షిప్పింగ్ హార్బర్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మతిస్థిమితం లేని యువతి బిగ్గరగా రోధిస్తు స్థానికులు జరిగిన విషయాన్ని వెల్లడించింది. అప్పటికే అనుమానాస్పదంగా అక్కడే తిరుగుతున్న ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకున్నారు.
ఆ క్రమంలో ముగ్గురిలో ఓ యువకుడు పరారైయ్యాడు. దాంతో ఇద్దరు యువకులకు స్థానికులు దేహశుద్దీ చేశారు. దాంతో సదరు యువకులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో స్థానికులు నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మతిస్థిమితం లేని మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.