Woman gang-raped
-
భర్త ఎదుటే అత్యాచారం
బెంగళూరు: కూలి పనులు ముగించుకుని భర్తతో కలిసి ఇంటికి వెళ్తున్న మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగళూరులోని బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బన్నేరు ఘట్ట సమీపంలోని హుల్లహల్లిలో నివాసముంటున్న దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ నెల 23 వ తేదీన సాయంత్రం వీరిద్దరూ కూలి పనులు ముగించుకుని హుల్లహల్లి తోపు గుండా ఇంటికి బయల్దేరారు. పెయింట్ పని చేసేందుకు వచ్చి కోళిపామ్ లేఔట్ లో నివాసముంటున్న తమిళనాడుకు చెందిన వినోద్, మణి, రాజులు వారిని గమనించి వెంటబడ్డారు. దంపతులను అడ్డగించి కత్తితో బెదిరించారు. అనంతరం భర్త ఎదుటే వివాహితపై సాముహిక అత్యాచారానికి పాల్పడి పరారయ్యారు. జరిగిన ఉదంతంపై బాధితురాలు బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ లో గురువారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను శుక్రవారం అరెస్టు చేశారు. -
మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం
-
మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం
విశాఖపట్నం నగరంలోని షిప్పింగ్ హార్బర్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మతిస్థిమితం లేని యువతి బిగ్గరగా రోధిస్తు స్థానికులు జరిగిన విషయాన్ని వెల్లడించింది. అప్పటికే అనుమానాస్పదంగా అక్కడే తిరుగుతున్న ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఆ క్రమంలో ముగ్గురిలో ఓ యువకుడు పరారైయ్యాడు. దాంతో ఇద్దరు యువకులకు స్థానికులు దేహశుద్దీ చేశారు. దాంతో సదరు యువకులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో స్థానికులు నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మతిస్థిమితం లేని మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది. అయిన మహిళలపై దాడులు దేశంలో నిత్యకృత్యమై పోయాయి. విడాకుల కేసులో భాగంగా కోర్టుకు వెళ్లి ఇంటికి తిరుగు ముఖంపట్టిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జిల్లాలో గత రాత్రి చోటు చేసుకుంది. విడాకులు కేసులో లాయర్‌తో మాట్లాడేందుకు ఓ మహిళ బుధవారం ఉదయం ఘజియాబాద్ కోర్టు వెళ్లింది. అక్కడి లాయర్‌తో కేసు విషయం సంప్రదించి అనంతరం స్వగ్రామానికి బయలుదేరింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి తాను నీకు సమీప బంధువు అవుతానని చెప్పాడంతో ఆ యువతి అతని మాటలు గుడ్డిగా నమ్మింది. తనకు ఉద్యోగం కావాలని సదరు వ్యక్తిని అభ్యర్థించింది. దాంతో తన ఇంటికి వెళ్లి అక్కడ అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి కారులో ఎక్కించారు. అనంతరం ఆ యువతిపై బంధువు అని చెప్పిన వ్యక్తితోపాటు అప్పటికే ఆ కారులో ఉన్న ముగ్గురు యువకులు కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతని గోవిందపురం ప్రాంతంలో పడేసి కారుతో సహా పరారైయ్యారు. దాంతో ఆ యువతి స్థానిక పోలీసులుకు జరిగిన ఘటనను వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కదులుతున్న ట్రక్‌లో మహిళపై సామూహిక అత్యాచారం
న్యూఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం ఘటన మరువక ముందే అదే తరహా సంఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. బోగినిపూర్లోని నౌబస్టా బైపాస్ రహదారిలో 45 సంవత్సరాల వయస్సు గల మహిళపై ప్రయాణిస్తున్న ట్రక్‌లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆ మహిళను ట్రక్ నుంచి విసిరివేశారు. నలుగురు నిందితులు ట్రక్‌తో సహా పరారయ్యారు. దాంతో రహదారిపై అపస్మారకస్థితిలో పడి ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సామూహిక అత్యాచారానికి గురైన మహిళను ఆసుపత్రికి తరలించారు. రహదారిపై వెళ్లున్న ట్రక్‌ను ఆపి తనను బోగినిపూర్ వరకు తీసుకువెళ్లాలని డ్రైవర్‌ను కోరినట్లు, అందుకు డ్రైవర్ అంగీకరించినట్లు బాధితురాలు పోలీసులకు చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ముగ్గురు వ్యక్తులు ట్రక్‌లోకి ఎక్కారు. అనంతంర ఆ నలుగురు వ్యక్తులు తనపై సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ఆ ఫిర్యాదులో వివరించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.