కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది. అయిన మహిళలపై దాడులు దేశంలో నిత్యకృత్యమై పోయాయి. విడాకుల కేసులో భాగంగా కోర్టుకు వెళ్లి ఇంటికి తిరుగు ముఖంపట్టిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఉత్తరప్రదేశ్లో మీరట్ జిల్లాలో గత రాత్రి చోటు చేసుకుంది. విడాకులు కేసులో లాయర్తో మాట్లాడేందుకు ఓ మహిళ బుధవారం ఉదయం ఘజియాబాద్ కోర్టు వెళ్లింది.
అక్కడి లాయర్తో కేసు విషయం సంప్రదించి అనంతరం స్వగ్రామానికి బయలుదేరింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి తాను నీకు సమీప బంధువు అవుతానని చెప్పాడంతో ఆ యువతి అతని మాటలు గుడ్డిగా నమ్మింది. తనకు ఉద్యోగం కావాలని సదరు వ్యక్తిని అభ్యర్థించింది. దాంతో తన ఇంటికి వెళ్లి అక్కడ అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి కారులో ఎక్కించారు.
అనంతరం ఆ యువతిపై బంధువు అని చెప్పిన వ్యక్తితోపాటు అప్పటికే ఆ కారులో ఉన్న ముగ్గురు యువకులు కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతని గోవిందపురం ప్రాంతంలో పడేసి కారుతో సహా పరారైయ్యారు. దాంతో ఆ యువతి స్థానిక పోలీసులుకు జరిగిన ఘటనను వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.