Ghaziabad Court
-
Video: కోర్టులో జడ్జితో గొడవ.. లాయర్లను తరిమిన పోలీసులు
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విచారణ సమయంలో జడ్జికి, ఓ న్యాయవాదికి మధ్య వివాదం తలతెత్తడంతో కోర్టు రణరంగంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కోర్టులో గొడవకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జితో, లాయర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇది చివరకు గొడవకు దారితీసింది. వెంటనే భారీ సంఖ్యలో లాయర్లు జడ్జీ ఛాంబర్ వద్ద గుమిగూడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చేపట్టిన అడ్వకేట్లను తరిమేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కూర్చీలు పట్టుకొని మరీ లాయర్లను బయటకు తరిమేశారు. ఆ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలిటరీ దళాలు కూడా కోర్టు ఆవరణకు చేరుకున్నాయి.ఈ ఘటనలో పలువురు న్యాయవాదులకు గాయాలైనట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ వివాదంపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సమావేశానికి పిలపునిచ్చింది. తమను జడ్జి ఛాంబర్ నుంచి బయటకు గెంటేసిన తరువాత న్యాయవాదులంతా కోర్టు బయట ధర్నా చేపట్టారు. జడ్జికి, సెక్యూరిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.In #UttarPradesh's #Ghaziabad, a major disturbance erupted in the District Court following an argument between a district judge and a lawyer during a bail hearing. The altercation soon escalated, leading to a chaotic scene as large numbers of lawyers gathered and tensions… pic.twitter.com/0RsozCFHag— Hate Detector 🔍 (@HateDetectors) October 29, 2024 -
Video: చిరుతపులి బీభత్సం.. కోర్టు ఆవరణంలోకి ప్రవేశించి, ఆరుగురిపై దాడి
లక్నో: కోర్టు కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఓ చిరుతపులి స్థానికంగా బీభత్సం సృష్టించింది. కోర్టు అంతా సంచరిస్తూ పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్ కోర్టులోని మొదటి అంతస్తులోకి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ చిరుతపలి ప్రవేశించింది. కోర్టు ప్రాంగణంలో చిరుతపులి కనిపించడంతో భయంతో అక్కడున్న వారంతా అటు ఇటు పరుగులు తీశారు. చిరుత నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొంతమంది లాయర్లు లాయర్లు తమ గదుల్లోకి వెళ్లి లాక్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణంలో గందరగోళం నెలకొంది. చుట్టూ జనాలను చూసి బెంబేలెత్తిన చిరుతపులి మరింత రెచ్చిపోయింది. కర్రల సాయంతో తరిమికొట్టేందుకు వెళ్లిన లాయర్‌పై చిరుతపులిని దాడి చేసింది. అంతేగాక కోర్టు ఆవరణలో చెప్పులు కుట్టే వ్యక్తి, పోలీస్ అధికారితో సహా పలువురిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచింది. pic.twitter.com/OuxoVC3Bv4 — Utkarsh Singh (@utkarshs88) February 8, 2023 చిరుతపులి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాలుగు గంటలు శ్రమించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతపులిని నెట్లో బంధించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వద్ద చిరుతపులి సంచారం.. న్యాయవాదులను గాయపరిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Several people injured as leopard enters Ghaziabad district court premises in Uttar Pradesh pic.twitter.com/ZYD0oPTtOl — ANI (@ANI) February 8, 2023 -
కదులుతున్న కారులో మహిళపై సామూహిక అత్యాచారం
దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు నిరోధించేందుకు ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేస్తోంది. అయిన మహిళలపై దాడులు దేశంలో నిత్యకృత్యమై పోయాయి. విడాకుల కేసులో భాగంగా కోర్టుకు వెళ్లి ఇంటికి తిరుగు ముఖంపట్టిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో మీరట్ జిల్లాలో గత రాత్రి చోటు చేసుకుంది. విడాకులు కేసులో లాయర్‌తో మాట్లాడేందుకు ఓ మహిళ బుధవారం ఉదయం ఘజియాబాద్ కోర్టు వెళ్లింది. అక్కడి లాయర్‌తో కేసు విషయం సంప్రదించి అనంతరం స్వగ్రామానికి బయలుదేరింది. ఆ క్రమంలో ఓ వ్యక్తి తాను నీకు సమీప బంధువు అవుతానని చెప్పాడంతో ఆ యువతి అతని మాటలు గుడ్డిగా నమ్మింది. తనకు ఉద్యోగం కావాలని సదరు వ్యక్తిని అభ్యర్థించింది. దాంతో తన ఇంటికి వెళ్లి అక్కడ అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి కారులో ఎక్కించారు. అనంతరం ఆ యువతిపై బంధువు అని చెప్పిన వ్యక్తితోపాటు అప్పటికే ఆ కారులో ఉన్న ముగ్గురు యువకులు కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువతని గోవిందపురం ప్రాంతంలో పడేసి కారుతో సహా పరారైయ్యారు. దాంతో ఆ యువతి స్థానిక పోలీసులుకు జరిగిన ఘటనను వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారానికి గురైన యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ఆరుషి తల్లిదండ్రులే హంతకులు: కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ఆరుషి, పని మనిషి హేమ్రాజ్ హత్య కేసులో ఆరుషి తల్లిదండ్రులు తల్వార్ దంపతులే దోషులని ఘజియాబాద్ కోర్టు తీర్పు చెప్పింది. అయితే దోషులకు శిక్షలను కోర్టు రేపు ఖరారు చేస్తుంది. అయిదున్నరేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ సాగిన ఆరుషి హత్య కేసులో ఎట్టకేలకు ఈ రోజు కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో తుది తీర్పు వెలువడుతున్న ఈ నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ కేసుకు సంబంధించి 15 నెలల్లో 84 మంది సాక్షులను సీబీఐ విచారించింది. తల్లిదండ్రులు డాక్టర్ రాజేశ్ తల్వార్, ఆయన భార్య నుపుర్ తల్వార్లే కూతురు ఆరుషి, తమ వద్ద పని చేసే హేమరాజ్‌ను హత్య చేశారని ఛార్జీషీట్లో పేర్కొన్నారు. ఆరుషిని చంపింది ఆమె తల్లిదండ్రులేనని సీబీఐ కోర్టు నిర్ధారించింది. హత్యతో పాటు సాక్ష్యాధారాలు కూడా వారు తారుమారు చేశారంటూ కోర్టు తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ముందుగా అనుకున్నట్లే ఆరుషి తల్లిదండ్రులు నూపుర్, రాజేష్ తల్వార్లే దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయు విహార్‌లోని తన నివాసంలో మే16, 2008న 14 ఏళ్ల ఆరుషి హత్యకు గురైంది. నిందితుడిగా అనుమానించిన హేమ్రాజ్ కూడా ఆ తరువాత అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తల్లిదండ్రలు ఉన్నారు. ఈ హత్య మిస్టరీగా మారడంతో ఢిల్లీ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ప్రారంభం నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజలు ఈ కేసు పట్ల ఆసక్తి చూపించారు. జర్నలిస్టులను సాక్షులుగా పరిగణించాలన్న తల్వార్ విజ్ఞప్తిని సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఆరుషి హత్య కేసులో సాక్షులను ప్రశ్నించాలన్న తల్వార్ దంపతుల విజ్ఞప్తి సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎడిజి(శాంతి భద్రతలు), సిబిఐ సంయుక్త సంచాలకులు అరుణ్ కుమార్‌లతో పాటు అదనంగా మరో 14 మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టు ముందుగా కొట్టివేసింది. దాంతో వారు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. సుప్రీం కోర్టు వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. ఘజియాబాద్ కోర్టు నూపుర్, రాజేష్ తల్వార్లనే హంతకులుగా తీర్పు చెప్పింది. అయితే కోర్టు రేపు శిక్ష ఖరారు చేస్తుంది.