shipping harbour
-
హరిత క్షేత్ర ఓడరేవులు అభివృద్ధి చేస్తున్నాం: సీఎం జగన్
విశాఖపట్నం: దేశీయ దిగుమతుల్లో 2030 నాటికి కనీసం 10 శాతం దిగుబడులు రాష్ట్రం నుంచి జరగాలనేదే ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో మారిటైమ్ ఇండియా-2021 సదస్సులో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం విశాఖలో మారిటైమ్ ఇండియా-2021 సదస్సును ప్రారంభించారు. అనంతరం మారిటైమ్ ఇండియా విజన్-2030 ఈ-బుక్‌ను ప్రధాని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ సమావేశంలో వర్చువల్ ద్వారా పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ''మారిటైమ్ రంగంలో భారత్ విశిష్ట గుర్తింపు సాధిస్తుంది. మారిటైమ్ ఇండియా సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుంది. గతేడాది నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా జరిగింది. నౌకాశ్రయాలపై ఆధారపడి ఇటీవల రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చాయి. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేలా కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం.. భావనపాడు వద్ద హరిత క్షేత్ర ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నాం. గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్స్ ద్వారా పోర్టుల నిర్వహణ అత్యంత సులువు కానుంది. నౌకాశ్రయాలు, ఓడరేవులు పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. ఆక్వా వర్శిటీ ఏర్పాటుతోపాటు, 8 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం 100 శాతం ఎఫ్‌డీఐలు, మేక్ ఇన్ ఇండియా, సాగర్మాల, భారత్‌మాల వంటి సంస్కరణల ప్రక్రియలు విశేష పురోగతికి దోహదం చేశాయి. ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి ఒక నిదర్శనంలా మారిటైమ్ ఇండియా విజన్-2030 డాక్యుమెంట్ నిలుస్తుంది. సముద్ర యానం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలన్న స్ఫూర్తిదాయక ఎజెండా ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంది. రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ. తీరప్రాంతం ఉంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం..సులభతర వాణిజ్యంలో రాష్ట్రం తొలిస్థానంలో నిలిచింది. నౌకాశ్రయాల్లో మౌలిక వసతుల కల్పన, వాటిపై ఆధారపడిన పరిశ్రమలకు..నిరంతర ప్రోత్సాహం ద్వారానే ఇది సాధ్యమైంది.విశాఖలో అతిపెద్ద నౌకాశ్రయంతోపాటు 5 చోట్ల నౌకాశ్రయాలు.. మరో 10 గుర్తించిన ఓడరేవులు ఉన్నాయి. 170 టన్నులకు పైగా సరుకుల రవాణా జరుగుతోంది.కార్గో రవాణాలో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. '' అని తెలిపారు. -
‘సీఎం జగన్‌కు మత్స్యకారులు రుణపడి ఉంటారు’
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోడని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం జిల్లాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అప్పట్లో చంద్రబాబు విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదు కిలోమీటర్లుకు ఒక జెట్టి నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని గుర్తు చేశారు. మత్స్యకారులకు పింఛన్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు మాట తప్పారని విమర్శించారు. చదవండి: ఫిషింగ్ హార్బర్లకు సీఎం జగన్ శంకుస్థాపన మత్స్యకార దినోత్సవం రోజు చంద్రబాబు కేవలం కేకు మాత్రమే కట్ చేసి.. మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే చంద్రబాబు కన్నెర్ర చేసేవారని ప్రస్తావించారు. నేడు నాలుగు షిప్పింగ్ హార్బర్స్‌కు శంకుస్థాపన చేసి సీఎం జగన్ చరిత్ర సృష్టించారన్నారు. వైఎస్ జగన్ పాలన మత్స్యకారులకు స్వర్ణయుగం వంటిదని కొనియాడారు. మత్స్యకారులు సీఎం జగన్‌కు రుణపడి ఉంటారని, మత్స్యకారులు ఇచ్చిన హామీలను సీఎం 17 నెలల్లోనే అమలు చేశారని ప్రశంసించారు. పాకిస్తాన్లో చిక్కుకున్న మత్స్యకారులను సీఎం జగన్ దేశానికి తిరిగి తీసుకువచ్చారన్నారు. చదవండి: సీఎం జగన్‌ని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి -
అటు ఆదాయం.. ఇటు ఉపాధి
సాక్షి, అమరావతి: వేలాది మందికి ఉపాధితో పాటు ఆదాయాన్ని అందించే షిప్ రీ సైక్లింగ్ వ్యాపారంలోని అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పోర్టులు, నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టిన బోర్డు.. తాజాగా పాడైపోయిన ఓడలను ఒడ్డుకు చేర్చి విడదీసే రీ సైక్లింగ్ వ్యాపారం చేపట్టాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మారిటైమ్ ఇండియా విజన్–2030 కింద షిప్ రీ సైక్లింగ్ వ్యాపారాన్ని పెద్దయెత్తున ప్రోత్సహిస్తుండటమే కాకుండా, ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019ని కూడా తీసుకురావడంతో ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకేసారి 50 ఓడల రీ సైక్లింగ్ గుజరాత్లో (అలాంగ్‌లో) ఏటా 300 ఓడలు రీ సైక్లింగ్ చేయడం ద్వారా ఆ రాష్ట్రం భారీగా ఆదాయం పొందుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓడల రీ సైక్లింగ్ చేపట్టాలని మారిటైమ్ బోర్డు భావిస్తోంది. ఇందుకోసం అలల ఉధృతి ఎక్కువగా ఉండి, మత్స్యకారుల చేపల వేటకు ఎక్కువ ఉపయోగపడని తీర ప్రాంతాలను పరిశీలించి.. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు ఇందుకు అనువైనవిగా గుర్తించింది. వీటిలో ఒక ప్రాంతాన్ని ఖరారు చేసి ఒకేసారి 50 ఓడలను రీ సైక్లింగ్ చేయడానికి తగిన విధంగా అక్కడ మౌలిక వసతులు కల్పించనుంది. అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హానీ లేని విధంగా యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. వేలాది మందికి ఉపాధి యూనిట్ ఏర్పాటుచేసే ప్రాంతంలో ఉపాధి కోల్పోయేవారికి ఓడల రీ సైక్లింగ్ చట్టం–2019 ద్వారా తగిన రక్షణ కల్పించనున్నారు. ఒక ఓడను విడగొట్టాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుంది. 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. దీనికి ఐదు రెట్ల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. యూనిట్లో ఒకసారి 50 ఓడల రీ సైక్లింగ్ ప్రారంభమైతే ప్రత్యక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. కాగా ఏటా 150 ఓడలను రీ సైక్లింగ్ చేయాలని మారిటైమ్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. బయటకు తీసిన ఇనుమును తరలించడానికి, ఇనుమును కరిగించడానికి రీ రోలింగ్ మిల్స్ వంటి అనేక అనుబంధ పరిశ్రమలు కూడా ఏర్పాటవుతాయి. ఒక నౌకను విడదీయడానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరమవుతుందని, ఆ విధంగా 50 నౌకలకు కలిపి కనీసం 50 ఎకరాలు అవసరమవుతాయని మారిటైమ్ బోర్డు అంచనా వేసింది. గతంలో 5 ఓడల రీ సైక్లింగ్ 1995–96 ప్రాంతంలో కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరం వద్ద 5 నౌకలను రీ సైక్లింగ్ చేశారు. దాని ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలోనే చెరో రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో ఈ యూనిట్ ఏర్పాటుకు అనేక ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదు. ► ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న వాణిజ్య నౌకల సంఖ్య 53,000 ► ఇందులో ఏటా 1,000 నౌకలు రీ సైక్లింగ్‌కు వెళ్తున్నాయి ► అంతర్జాతీయ రీ సైక్లింగ్ వ్యాపారంలో మన దేశం వాటా 30 శాతం ► 2024 నాటికి రీ సైక్లింగ్ సామర్థ్యం 40 శాతం పెంచడం ద్వారా 60 శాతం మార్కెట్ వాటాను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ► ఇందులో 50 శాతం వ్యాపారం చేజిక్కించుకోవాలని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రణాళిక 50% మార్కెట్ వాటా లక్ష్యం కేవలం పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణమే కాకుండా సముద్ర ఆధారిత వ్యాపారాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది. ప్రస్తుతం షిప్ రీ సైక్లింగ్‌లో రెండవ స్థానంలో ఉన్న మన దేశాన్ని 2030 నాటికి మొదటి స్థానానికి చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో జరిగే షిప్ రీ సైక్లింగ్‌లో 50 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. –ఎన్.రామకృష్ణారెడ్డి, సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు -
లోను బదులు గ్రాంట్ ఇవ్వండి: మోపిదేవి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఫిషింగ్ హార్బర్లకు ఫిషరీస్, ఆక్వాకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎఫ్ఐడీఎఫ్)లోను బదులుగా తగిన గ్రాంట్ ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కేంద్రాన్ని కోరారు. శనివారం ఆయన రాజ్యసభ జీరోఅవర్‌లో మాట్లాడారు. అనుమతులు జారీ చేసిన మూడు ఫిషింగ్ హార్బర్లకు లోను బదులు గ్రాంట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తరువాత, మిగిలినటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ లోటు ఎక్కువగా ఉండటం, కోవిడ్-19 ప్రభావముంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిందని తెలిపారు. అయినప్పటికీ భారతదేశంలోనే ఆక్వా రంగంలో ముందుండి, విదేశీ మారక ద్రవ్యాన్ని సమపార్జించడంలో ఏపీ మొదటి స్థానంలో ఉందని వివరించారు. (రాజ్యసభలో విశాఖ వాణి) ఏపీకి సంబంధించి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసినటువంటి మూడు ఫిషింగ్ హార్బర్లు నిజాంపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ. 379.17 కోట్లు, మచిలీపట్నం(ఫేస్-2) అంచనా వ్యయం రూ.285.609 కోట్లు, ఉప్పాడ అంచనా వ్యయం రూ. 350.44కోట్లకు భారత ప్రభుత్వ వాటా క్రింద ఒక్కొక్కదానికి రూ.150 కోట్లు మంజూరు చేసింది. అంటే రూ.450కోట్లు ఎఫ్ఐడీఎఫ్ రుణంగా కాకుండా, మొత్తం గ్రాంటు రూపంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిదిగా ఎంపీ రాజ్యసభలో కేంద్రాన్ని కోరారు. (ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు) -
కొత్తగా 9 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కీలక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అదేవిధంగా మత్స్యకారుల కోసం అత్యాధునిక పద్ధతులను తీసుకురావాలని తెలిపారు. రాష్ట్రంలోని ఫిషింగ్ హార్బర్లు, పోర్టులు, విమానాశ్రయాలపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మత్స్యకారుల ప్రధాన వృత్తి వేట, దాని కోసం మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఫిషింగ్ హార్బర్లను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా 9 చోట్ల రెండు విడతల్లో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం జరుగుతుందన్నారు. దాదాపు రూ. 2,901.61 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో ఫేజ్ –2 హార్బర్, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నెలో మొదటి విడత కింద రూ.1,304 కోట్లతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. (ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్) అదేవిధంగా రెండో విడత కింద రూ. 1597.61 కోట్లతో మరో ఐదు చోట్ల హార్బర్ల నిర్మాణం పూర్తి చేస్తామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా వాడ్రేవు, కొత్తపట్నం, శ్రీకాకుళం జిల్లా బూదగట్ల పాలెం, ఎడ్డువాని పాలెం, విశాఖ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ కోసం ఈ డబ్బును ఉపయోగిస్తూ.. మొత్తంగా 9 చోట్ల ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడతామని సీఎం జగన్ తెలిపారు. డీప్ సీ ఫిషింగ్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. బోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి మిగిలి ఉన్న భూసేకరణ సహా అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులు బదులుగా పర్యావరణ హితమైన ప్రాజెక్టులపై దృష్టిపెట్టాలని అధికారులకు వైఎస్ జగన్ సూచనలు ఇచ్చారు. (ఆ లేఖపై డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు) -
మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం
-
మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం
విశాఖపట్నం నగరంలోని షిప్పింగ్ హార్బర్లో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని మహిళపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మతిస్థిమితం లేని యువతి బిగ్గరగా రోధిస్తు స్థానికులు జరిగిన విషయాన్ని వెల్లడించింది. అప్పటికే అనుమానాస్పదంగా అక్కడే తిరుగుతున్న ముగ్గురు యువకులను స్థానికులు పట్టుకున్నారు. ఆ క్రమంలో ముగ్గురిలో ఓ యువకుడు పరారైయ్యాడు. దాంతో ఇద్దరు యువకులకు స్థానికులు దేహశుద్దీ చేశారు. దాంతో సదరు యువకులు చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో స్థానికులు నిందితులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మతిస్థిమితం లేని మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.